మ్యూజిక్ వింటూ నిద్రపోండి.. కొత్త సౌండ్ స్లీప్ ఆడియో తలగడతో..!!

Posted By: Staff

మ్యూజిక్ వింటూ నిద్రపోండి.. కొత్త సౌండ్ స్లీప్ ఆడియో తలగడతో..!!

తీరిక సమయాల్లో మ్యూజిక్‌ను ఆస్వాదించటం పలువురి హాబీ., కొందరు హెడ్ ఫోన్ల ద్వారా మ్యూజిక్ ప్రపంచంలో లీనమైతే, మరి కొందరు హోమ్ థియోటర్ సౌలభ్యతతో మోత మోగిస్తుంటారు.

అయితే కొందరు మాత్రం ఇష్టమైన పాటలు వింటూ నిద్రలోకి జారకుంటారు. ఇటువంటి సంగీత ప్రియుల కోసం ఓ తలదిండు రూపుదిద్దుకుంది. స్పీకర్ వ్యవస్థను ఈ దిండులో అమర్చారు. ఎంపీత్రీ ప్లేయర్, రేడియో, టీవిలకు అనుసంధానించుకునే విధంగా 3.5mm స్టీరియో ప్లగ్‌ను తలగడలో ఏర్పాటు చేశారు.

ఇతరులకు ఇబ్బంది లేకుండా పాటలు, రేడియో‌లను వినవచ్చు. పాటల మెనూ పూర్తవ్వగానే అటోమెటిక్‌గా మ్యూజిక్ ఆఫ్ అవుతుంది. సంగీతం వింటూ నిద్రపోయే అలవాటున్న వారికి ఈ ‘sound A sleep’ పరికరం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రయాణ సందర్భాల్లో ఈ తలగడతో విశ్రాంతితో వినోదాన్ని పొందవచ్చు. ధర విషయానకి వస్తే, సుమారుగా రూ.1150.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot