కిక్కిచ్చే ‘సౌండ్’ కోసం సౌండ్‌కిక్ వైర్‌లెస్ స్పీకర్!!!

Posted By: Prashanth

కిక్కిచ్చే ‘సౌండ్’ కోసం సౌండ్‌కిక్ వైర్‌లెస్ స్పీకర్!!!

 

కొత్తదనం కోసం పరితపిస్తున్న మ్యూజిక్ ప్రేమికులుకు ఈ కొత్త ఏడాదికిగాను కిక్కిచ్చే న్యూస్..!!, అనుక్షణం సృజనాత్మక పై దృష్ట సారించే ఆడియో పరికరాల తయారీ బ్రాండ్ ‘సౌండ్ ఫ్రీక్’(Soundfreaq) ప్రత్యేక లక్షణాలతో కూడిన ఓ అపూర్వమైన పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. ఆకట్టుకునే సౌండ్ ప్రదర్శనను కనబర్చే ‘సౌండ్ కిక్’ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను ఈ జనవరిలో నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో’లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. పోర్టుబుల్ బ్టూటూత్ స్పీకర్ల మార్కెట్లో సరికొత్త ప్రభంజనానికి ‘సౌండ్ కిక్’ తెరలేపనుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

చిన్నదైన ఈ స్పీకర్ సిస్టంను సౌకర్యవంతంగా ప్రయాణా సందర్భాల్లో క్యారీ చెయ్యవచ్చు. ఈ గ్యాడ్జెట్ సౌండ్ క్లారిటీ గమనర్హమైన అంశం. ఈ స్పీకర్‌లో ఏర్పాటు చేసిన లితియమ్ ఐయాన్ బ్యాటరీ కేవలం సింగిల్  ఛార్జ్‌‌తో 7 గంటల బ్యాకప్‌నిస్తుంది. వినియోగదారులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పోర్టబుల్ స్పీకర్లను డిజైన్ చేసినట్లు సౌండ్ ఫ్రీక్ క్రియోటివ్ హెడ్ మాథ్యూ పాప్రోకీ తెలిపారు. ఉన్నతస్థాయి బ్లూటూత్ వ్యవస్థను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పొందుపరిరచిన App-solute ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతిని సృష్టిస్తుందని పాప్రోకీ వెల్లడించారు.

బ్లూటూత్ సౌలభ్యత ఉన్న డివైజ్‌లకు ఈ స్పీకర్‌ను జత చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ద్వారా స్పీకర్‌కు ఛార్జ్ అందుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot