రెండు ఫోన్లతో ఒకే సారి..?

Posted By: Staff

రెండు ఫోన్లతో ఒకే సారి..?

 

అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో సుస్తిర స్థానాన్ని కైవసం చేసుకున్న ‘నోకియా’ అదే హవాను కొనసాగిస్తూ ఆడియో పరికరాల మార్కెట్లో దూసుకుపోతుంది.  తాజాగా ఈ దిగ్గజ బ్రాండ్ అత్యాధునిక ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ‘నోకియా BH110’ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను డిజైన్ చేసింది.

డివైజులో ఏర్పాటు చేసిన ‘ఆడ్వాన్సడ్ మల్టీ పాయింట్ టెక్నాలజీ’ రెండు  మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాల్స్ సమాచారాన్ని మీకు చేరవేస్తుంది. ఉదాహరణకు:  ‘నోకియా BH 110’ హెడ్‌సెట్‌ను ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.  ఆ రెండు ఫోన్లు దూరంగా ఉన్నప్పటికి  వాటి ద్వారా వచ్చే కాల్స్‌ను  అనుసంధానించబడిన హెడ్‌సెట్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.

క్లుప్తంగా ‘నోకియా BH110’ ఫీచర్లు:

*  హెడ్‌సెట్ సైజు మరియు  స్పెసిఫికేషన్ 56.0 x 17.4 x 8.7 mm, * బరువు 10 గ్రాములు,  2mm ఛార్జింగ్ కనెక్టర్, *   బ్యాకప్ 6 గంటలు,  *  శక్తివంతమైన 9 mm డైనమిక్ స్పీకర్లను డివైజులో పొందుపరిచారు, *   ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 300 Hz నుంచి 3400 Hz వరకు, * మల్టీ ఫంక్షన్ బటన్, *  నలుపు, * తెలుపు రంగుల్లో ఈ హెడ్‌సెట్లు డిజైన్ కాబడ్డాయి, *  ధర, *  ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting