సొగసైన స్పీకర్లు ‘ఐహాగ్’ రూపంలో !!

Posted By: Super

సొగసైన స్పీకర్లు ‘ఐహాగ్’ రూపంలో !!

పై చిత్రంలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఆకృతి చిన్నారులు ఆడుకునే టాయ్ అనుకుంటే పొరపాటే, బొమ్మ రూపును పోలి ఉన్న ఈ పరికరం పేరు ‘ఐహాగ్’ ఐపాడ్ డాకింగ్ స్టేషన్. ఆశ్చర్యంగా ఉందికదూ.., ప్రఖ్యాత లైఫ్ స్టైల్ కంపెనీ ‘స్పీకల్’ ఈ అల్ట్రా‌మోడల్ ఆడియో స్పీకర్ పరికరాన్ని రూపొందించింది.

‘హాగ్’ ఆకృతిలో డిజైన్ చేయబడ్డ ఈ డాకింగ్ స్టేషన్‌ను ఐపాడ్‌లతో పాటు ఐఫోన్ పరికరాలకు అనుసంధానం చేసుకోవచ్చు. 2.1 సౌండ్ వ్యవస్థను కలిగి, నలు మూలలకు మ్యూజిక్‌ను వ్యాప్తిచేసే విధంగా 360 డిగ్రీల ఆడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. రిమోట్ కంట్రోలర్ ఆధారితంగా డాకింగ్ స్టేషన్‌ను నియంత్రించుకోవచ్చు.

పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 10 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఏసీ పవర్ ఆడాప్టర్, స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ వ్యవస్థలు మన్నికైన పనితీరును అందిస్తుంది. డాకింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సౌండ్ ఫీచర్లను పరిశీలిస్తే అత్యాధునిక సూపర్ కూల్ స్పీకర్లతో పాటు, రెండు ట్వీటర్లను అమర్చారు. అనుసంధానించిన 20 వాట్ సబ్ ఊఫర్ వ్యవస్ధ శ్రోతను నాణ్యమైన అనుభూతికి లోను చేస్తుంది. 50 KHz నుంచి 20 KHz ఫ్రీక్వెన్సీని ఐహాగ్ సపోర్టు చేస్తుంది.

3.5mm ఆడియో జాక్ ఆధారితంగా వీడియోగేమ్ ప్లేయర్లతో పాటు టీవీలు, ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు హాగ్ డాకింగ్ స్టేషన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. పాండా కలర్‌లో డిజైన్ చేయుబడ్డ డాకింగ్ స్టేషన్ ఇండియన్ మార్కెట్లో రూ.6,700కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot