సోనీ సూపర్ క్వాలిటీ హెడ్ ఫోన్స్...

Posted By: Prashanth

సోనీ సూపర్ క్వాలిటీ హెడ్ ఫోన్స్...

 

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ సోనీ తాజాగా సరికొత్త ఇయర్ ఫోన్ లను డిజైన్ చేసింది. XBA-4గా వస్తున్న ఈ ఇయర్ ఫోన్స్ అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని ఒదిగి ఉన్నాయి. సౌండ్ క్వాలిటీని మరింత బ్యాలెన్స్ చేసే ‘ఆర్మెట్యూర్ డ్రైవర్ల’ను ఈ హెడ్ ఫోన్ లలో నిక్షిప్తం చేశారు.

సోనీ XBA-4 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ లు:

* లోవర్ సౌండ్ లీకేజ్,

* చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే సిలికాన్ ఇయర్ బడ్స్,

* ఇయర్ ఫోన్స్ సెన్సిటివిటీ 108dB/mW,

* శక్తివంతమైన సౌండ్,

* ఒకటిన్నర మీటర్ల కనెక్టింగ్ కేబుల్,

తక్కువ బరువు కలిగి ఉన్న ఈ ఇయర్ ఫోన్ లను ఆకర్షణీయమైన శైలిలో రూపొందించారు. సాధారణ వాటితో పోలిస్తే ఇవి అసాధారణ ప్రతిభను కనబరుస్తాయి. శ్రోత వీటిని ధరించి మ్యూజిక్ వింటున్న సందర్భంలో హోమ్ ధియోటర్ లో సౌండ్ వింటున్న అనుభూతికి లోనవుతాడు. అనవసర శబ్ధాలను ఈ ఇయర్ ఫోన్ లు నిరోధిస్తాయి. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot