సేఫ్టీ జర్నీ విత్ కంప్లీట్ వినోదం!!

Posted By: Prashanth

సేఫ్టీ జర్నీ విత్ కంప్లీట్ వినోదం!!

 

ప్రఖ్యాత ఆటోమొబైల్ తయారీ సంస్థ సుజుకితో ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ గార్మిన్ ఒప్పందం కుదుర్చుకుంది. సదురు కంపెనీ వాహనాలకు ఇన్-డ్యాష్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టంలను సమకూర్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం. గార్మిన్ సంస్థ ఇదువరుకే పలు వాహనాలకు ఆధునిక వ్యవస్థలతో కూడిన మ్యూజిక్ సిస్టంలను రూపొందించి విజయవంతమైంది.

ఇన్-డ్యాష్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం కీలక ఫీచర్లు:

* 6.1 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (టచ్ వ్యవస్థతో పని చేస్తుంది, హై రిసల్యూషన్, ఉత్తమ సామర్థ్యం),

* ఆధునిక లక్షణాలతో కూడిన సీడీ ప్లేయర్ వ్యవస్థ,

* ట్యూనర్ సౌలభ్యతతో ఎఫ్ఎమ్ రేడియో,

* బ్లూటూత్ కనెక్టువిటీ,

* ఎస్డీ‌కార్డ్ కనెక్టువిటీ,

* వాతావరణం ఇతర గ్యాస్, పెట్రోల్ ధరలకు సంబంధించి ఎప్పిటికప్పుడు తాజా సమాచారాన్ని డిస్‌ప్లే చేసే ఇన్‌బుల్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్,

* హ్యాండ్ ఫ్రీ కాలింగ్ ఆప్షన్,

* వాయిస్ కంట్రోలింగ్ ఆప్షన్స్,

* తాజా ట్రాఫిక్ సమాచారం తెలుసుకునే సౌలభ్యత,

* రోడ్ మ్యాప్,

* వాహనాన్ని బ్యాక్ చేసే సందర్భంలో క్లియర్ రోడ్ మ్యాప్ ఈ సిస్టం డిస్‌ప్లే ద్వారా చూడొచ్చు.

బ్లూటూత్ సాయంతో మీ ఐపోడ్ లేదా ఇతర మొబైల్ డివైజ్‌ను ఈ సిస్టంకు అనుసంధానించుకని వివిధ సురిక్షిత అప్లికేషన్‌ల సేవలను వినియోగించుకోవచ్చు. సిస్టంలో పొందుపరిచిన ఇంటర్నల్ ప్లాష్ మెమరీ సాయంతో ఇష్టమైన సంగీతాన్ని స్టోర్ చేసుకోవచ్చు. డివైజ్‌లో అమర్చిన నావిగేషన్, ఇతర బటన్లు సులవైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాయి. నిక్షిప్తం చేసిన వాయిస్ కంట్రోల్ ఆప్షన్ల ద్వారా వాల్యూమ్ ఇతర బేసిక్ ప్రోగ్రామ్‌లను కంట్రోల్ చేుసుకోవచ్చు.

అత్యాధునిక సేఫ్టీ టెక్నాలజీతో డిజైన్ కాబడిన ఈ ఇన్-డ్యాష్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టంను 2013 అమెరికాలో విడుదల కానున్న కార్లలో అమర్చనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఆస్ట్రేలియా, ఐరోపా, న్యూజిలాండ్, రిష్యా దేశాలో ఎంపిక చేసిన మోడళ్లలో వీటిని ఏర్పాటు చేయునున్నట్లు సమాచారం. ధర ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot