‘స్టీవ్ జాబ్స్’డిజైన్ చేసిన వాటి కో్సం..?

Posted By: Prashanth

‘స్టీవ్ జాబ్స్’డిజైన్ చేసిన వాటి కో్సం..?

 

‘‘దివంగత ఆపిల్ ఫౌండర్ ‘స్టీవ్ జాబ్స్’జ్ఞాపికగా.., ఐపోడ్, ఐఫోన్ పరికరాలను సాంకేతిక ప్రేమికులు కలకాలం గుర్తుంచుకుంటారు. వ్యక్తిగత వినోదాన్ని ఐపోడ్, ఐఫోన్ల రూపంలో మరింత సుపరిచితం చేసిన ‘ఆపిల్ ’ను, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఎదుర్కొవటంలో విఫలమయ్యాయి.’’

ఆపిల్ పరికరాల విశిష్టతను మరింత పెంచే క్రమంలో ‘ఎక్స్ ట్రీమ్ మ్యాక్’(XtremeMac)సంస్థ ‘ట్యాంగో TRX’డాక్ స్పీకర్ సిస్టమ్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐపోడ్, ఐఫోన్ మ్యూజిక్ ప్లేయర్లకు ఈ స్పీకర్ వ్యవస్థను జతచేసుకోవచ్చు.‘బ్లూటూత్’ మరియు ‘స్టీరియో మినీ జాక్ ఆక్సిలరీ ఇన్ పుట్’ఫీచర్లు ట్యాంగో స్పీకర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

‘ఐఫోన్ 4’కు, ట్యాంగో TRX స్పీకర్లను జతచేసి పరీక్షించిన నిపుణులు అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురుపించంటం స్పీకర్ల పనితీరుకు అద్దంపడుతుంది. సంగీతాన్ని వినసొంపైన బాణిలో అందించే సౌండ్ టెక్నాలజీని స్పీకర్లలో ఏర్పాటు చేశారు. ఆన్/ఆఫ్, సాంగ్ నావిగేషన్, వాల్యూమ్ కంట్రోల్, బ్లూటూత్ పెయిరింగ్, సోర్స్ సెలక్ట్ వంటి బటన్లను స్పీకర్ మందు భాగంలో డిజైన్ చేశారు. రిమోట్ కంట్రోల్ ఆధారితంగా స్పీకర్ ను ఆపరేట్ చేసుకోవచ్చు. ‘iOS’ఆప్లికేషన్ ను, స్పీకర్లలో పొందుపరిచారు. బ్లూటూత్ ఆధిరితంగా ఆడియో ఫైళ్లను ప్లే చేసుకోవచ్చు. 5-బ్యాండ్ ఈక్వలైజర్ వ్యవస్థ వినియోగదారుడికి మరిత లబ్థి చేకూరుస్తుంది. సహజసిద్దమైన సంగీత అనుభూతిని ఆస్వాదించాలనుకునే ఐపోడ్, ఐఫోన్ వినియోగదారులకు ట్యాంగో స్పీకర్లు సరైన జత. ‘ట్యాంగ్ TRX’ స్పీకర్ మార్కెట్ ధర రూ.12,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot