దుమ్ము రేపే హెడ్‌ఫోన్!!!

Posted By: Prashanth

దుమ్ము రేపే హెడ్‌ఫోన్!!!

 

గొప్ప ఆడియో ప్రదర్శనను వినసొంపైన కోణంలో వినాలనుకుంటున్నారా..?, అయితే టీడీకే వారి ‘ST700’ హెడ్‌ఫోన్‌లను ధరించండి. మ్యూజిక్‌ను గంటల తరబడి వింటూనే ఉంటారు. క్వాలిటీ ఆడియో పరికరాల తయారీదారైన టీడీకే (TDK), హై ఎండ్ ఆడియోను విడుదల చేసే ‘ST700’ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేసింది.

చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ హెడ్‌ఫోన్ ఇయర్ కప్‌లను డిజైన్ చేశారు. పొందుపరిచిన 40ఎమ్ఎమ్ డ్రైవర్ వ్యవస్థ సమతల్యుతతో కూడిన ఆడియోను క్లారిటీతో విడుదల చేస్తుంది. హెడ్‌ఫోన్ ఎక్స్‌టెన్షన్ కేబుల్ పొడవు 0.79m, 6.3mm, హెడ్‌ఫోన్‌లో 3.5mm ఆడాప్టర్‌లను ఏర్పాటు చేశారు. తక్కువ బరువు అదే విధంగా ఫోల్డింగ్ చేసుకునే సౌలభ్యత. ఈ గ్యాడ్జెట్‌లో నిరుత్సాహాపరిచే అంశాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. హెడ్‌ఫోన్ ధరించిన సందర్భంలో తల పై స్వల్ప ఒత్తిడి పెరిగే అవకాశముందని వారు సూచిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో ఈ గ్యాడ్జెట్ ధర విలువ తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot