మడతపెట్టు.. చెవిలో పెట్టు..!!

Posted By: Staff

మడతపెట్టు.. చెవిలో పెట్టు..!!

 

గ్యేమింగ్ ప్రేమకులందరూ తమ దృష్టిని ఐప్యాడ్, టాబ్లెట్ పీసీల వైపు మరల్చుతున్నారు. అటు ఇంట్లో.. ఇటు ప్రయాణ సందర్భాల్లో  గ్యేమ్ ఆడుకునేందు లేదా మూవీని తిలకించేందుకు  ఈ గ్యాడ్జెట్లు సౌకర్యవంతంగా ఉంటున్నాయి.  ఈ గ్యాడ్జెట్లకు  హెడ్ సెట్ స్పీకర్లను అనుసంధానం చేసుకుని మరి  రియాల్టీ సౌండ్ మజాను ఆస్వాదిస్తున్నారు.

ఈ తరహా అనుభూతిని కోరుకునే వారికి  టెక్ మోషన్ ఇంట్రూడర్ సంస్థ అత్యాధునిక  హెడ్‌సెట్ స్పీకర్‌ను ప్రవేశపెట్టింది. ఈ హెడ్‌ఫోన్లు బుహుముఖంగా ఉపయోగపడతాయి. సినిమాలు చూసే సందర్భంలో, గ్యేమింగ్ ఆడే సందర్భంలో స్పీకర్లు మాదిరిగా శబ్ధాన్ని విడుదల చేస్తాయి. ప్రైవసీ కోరుకున్న సందర్భంలో ఈ స్పీకర్లను  హెడ్ సెట్ గా మార్చుకుని చెవులకు అమర్చుకోవచ్చు.

సుప్రీం సౌండ్ అనుభూతిని ఈ ఆడియో గ్యాడ్జెట్ కలిగిస్తుంది. ఆధునిక పరిజ్ఞానంతో  డిజైన్ కాబడిన ఈ పరికరం వినియోగదారుడికి 100శాతం లబ్ధి చేకూరుస్తుంది.

ఈ హెడ్‌సెట్ ఇయర్ కప్స్ ‘త్రికోన’ (ట్రైయాంగులర్) ఆకృతిలో డిజైన్ కాబడ్డాయి. చెవులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వీటిని రూపొందించారు. పొందుపరిచిన డిటాచబుల్ మైక్రో ఫోన్ మన్నికైన వ్యవస్థను కలిగి ఉంటంది. అతి తక్కువ బరువుతో నిర్మించబడిన ఈ స్పీకర్ గ్యాడ్జెట్ ను సులువుగా ఫోల్డ్ చేసుకుని సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. పటిష్టమైన 40mm సౌండ్ డ్రవైర్లను సిస్టంలో అమర్చారు.  ఇన్‌లైన్ రిమోట్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారతీయ మార్కెట్లో టెక్ మోషన్ హెడ్‌సెట్ ధర రూ.3,200.

ఐపోడ్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ ఇతర కంప్యూటిండ్ డివైజులకు ఈ హెడ్‌సెట్‌ను జత చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting