‘టెక్న్ మోషన్’తో సరికొత్త గ్యేమింగ్ ఒరవడి!!

Posted By: Super

‘టెక్న్ మోషన్’తో సరికొత్త గ్యేమింగ్ ఒరవడి!!

కంప్యూటర్లో బేసిక్ గ్యేమింగ్ వ్యవస్థ 1980 నుంచి ప్రారంభమైంది.. అంచెలంచెలుగా టెక్ సంస్కృతి వ్యాప్తి చెందుతన్న నేపధ్యంలో అత్యాధునిక గ్యేమింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. గ్రాఫిక్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న కొత్త ఆటలు ఒళ్లుగగుర్పాటుకు లోను చేస్తూ శ్రోతకు రియాల్టీ అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్యేమింగ్ ప్రేమికులు ఇంటర్నెట్ మరియు ఇతర సౌలభ్యతలతో గంటల తరబడి గ్యేమింగ్ కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారు.

ప్రముఖ గ్యేమింగ్ పరికరాల తయారీదారు ‘టెక్న్ మోషన్’ సరికొత్త గ్యేమింగ్ హెడ్ సెట్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘పీసీ’ మరియు ‘Xbox 360’ గ్యాడ్జెట్ల ద్వారా గ్యేమింగ్ కార్యకలాపాల్లో మునిగితేలే వారికి ఈ హెడ్ సెట్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. మ్యూజిక్ మరియు ఆడియో పుస్తకాలను ఈ హెడ్ సెట్ ద్వారా నాణ్యమైన సౌండ్ పరిమాణంలో వినొచ్చు. రూ.1500లకు ఈ స్పీకర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని ఈ పరికరాల్లో ప్రవేశపెట్టారు. చెవులకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇయర్ కప్ లను రూపొందించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot