బొటని వేలుతో పాటలను ‘ప్లే’చెయ్యండి!!!

Posted By: Super

బొటని వేలుతో పాటలను ‘ప్లే’చెయ్యండి!!!

 

మ్యూజిక్ ప్రేమికులు అబ్బురపోయే అంశమిది.. టెక్ విప్లవం ఏ మేరకు విస్తరించిందో చాటిచెప్పే అద్భుతమిది.. ప్రపంచపు అతిచిన్న టచ్ ఆధారిత ఎంపీత్రీ ప్లేయర్‌ను ‘ద క్యూబ్ 2’ (theKube2) సంస్థ డిజైన్ చేసింది. లాస్‌వేగాస్ వేదికగా జరుగుతున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో  ఈ మ్యూజిక్ డివైజ్‌ను ఆవిష్కరించనున్నారు.

బ్యాటరీ ఆధారితంగా ఈ టచ్ సెన్సార్ మ్యూజిక్ ప్లేయర్‌కు పవర్ ఉత్పత్తి అవుతుంది. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఛార్జింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. బ్యాకప్ సామర్ధ్యం 6 గంటలు. ప్లేయర్ మెమరీ సామర్ధ్యం 4జీబి అయినప్పటికి ఎక్సటర్నల్ మైక్రో మెమరీ కార్డ్ సౌలభ్యతతో 32 జీబికి పెంచుకోవచ్చు. MP3 ఫార్మాట్ లో ఉన్న 8,000 పాటలను ప్లేయర్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. తక్కువ బరువు కలిగి ఉండే ఈ మ్యూజిక్ డివైజ్ సౌకర్యవంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

హై క్వాలిటీ సౌండ్ వ్యవస్థను ప్లేయర్లో నిక్షిప్తం చేశారు. ఈ డివైజుతో ఇయర్ ఫోన్స్ పొందవచ్చు. టచ్ సెన్సార్స్ ఆధారితంగా పనిచేసే ఈ మ్యూజిక్ ప్లేయర్‌ను బొటని వేలుతో ఆపరేట్ చేసుకోవచ్చు. కంప్యూటింగ్ డివైజ్‌లకు ఈ మ్యూజిక్ ప్లేయర్‌ను కేబుల్ ఆధారితంగా జత చేసుకోవచ్చు.  ఇండియన్ మార్కెట్లో ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ ధర రూ.2,500 (అంచనా మాత్రమే).

క్యూబ్ 2 విశేషాలు:

* సిల్వర్ మ్యాటీ ఫినిష్,

* క్యూబికల్ డిజైన్,

* 4జీబి మెమరీ సామర్ధ్యం,

* MP3, WMA, WAV, MIDI ఆడయో ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది,

* టచ్ సెన్సార్ వ్యవస్థ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot