టచ్ చేస్తే చాలు పాట ప్లే అవుతుంది..?

మ్యూజిక్ ప్రేమికులు అబ్బురపోయే అంశమిది.. టెక్ విప్లవం ఏ మేరకు విస్తరించిందో వెలువరించే అద్భుతమిది.. ప్రపంచపు అతిచిన్న టచ్ ఆధారిత ఎంపీత్రీ ప్లేయర్ ను ‘ద క్యూబ్ 2’ (theKube2) సంస్థ డిజైన్ చేసింది. లాస్ వేగాస్ (Las Vegas) వేధికగా వచ్చే ఏడాది 2012లో విడుదల కాబోతున్న టచ్ ఆధారిత మ్యూజిక్ డివైజ్ మార్కెట్ అంచనాలను పెంచుతుంది.
బ్యాటరీ వ్యవస్థ ఆధారితంగా ఈ టచ్ సెన్సార్ మ్యూజిక్ ప్లేయర్ ను రిఛార్జ్ చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఛార్జింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. బ్యాకప్ సామర్ధ్యం 6 గంటలు. ప్లేయర్ మెమరీ సామర్ధ్యం 4జీబి అయినప్పటికి ఎక్సటర్నల్ మైక్రో మెమరీ కార్డ్ సౌలభ్యతతో 32 జీబికి పెంచుకోవచ్చు. MP3 ఫార్మాట్ లో ఉన్న 8,000 పాటలను ప్లేయర్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. తక్కువ బరువు కలిగి ఉండే ఈ మ్యూజిక్ డివైజ్ సౌకర్యవంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది.
హై క్వాలిటీ సౌండ్ వ్యవస్థను ప్లేయర్లో నిక్షిప్తం చేశారు. ఈ డివైజుతో ఇయర్ ఫోన్స్ పొందవచ్చు. టచ్ సెన్సార్స్ ఆధారితంగా పనిచేసే ఈ మ్యూజిక్ ప్లేయర్ ను బొటని వేలుతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ ధర రూ.2,500 (అంచనా మాత్రమే).
ముఖ్య ఫీచర్లు: సిల్వర్ మ్యాటీ ఫినిష్, క్యూబికల్ డిజైన్, 4జీబి మెమరీ సామర్ధ్యం, MP3, WMA, WAV, MIDI ఆడయో ఫార్మాట్లను సపోర్ట్ చేసే స్వభావం, ఆల్యూమినియమ్ శరీరాకృతి, టచ్ సెన్సార్.


Click it and Unblock the Notifications








