ఈ హెడ్ ఫోన్ ద్వారా పాటలు విటుంటే...?

Posted By: Super

[caption id="attachment_3448" align="aligncenter" width="500" caption="ThinkSound"]

ఈ హెడ్ ఫోన్ ద్వారా పాటలు విటుంటే...?
[/caption]

 

ఇష్టమైన సంగీతాన్ని ఇష్టమైన కోణంలో వింటుంటే  కలిగే ఆ అనుభూతే వేరు, మరి అలాంటి మజానే మనకు చేరువ చేస్తుంది తింక్ సౌండ్ (ThinkSound) బ్రాండ్. హై క్వాలటీ ఆడియో ఉత్సత్తులను డిజైన్ చేయటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్  ‘ms01’ వేరియంట్లో ఇన్ - ఇయర్ హెడ్ ఫోన్లను డిజైన్ చేసింది. ప్రముఖ ఆడియో ఇంజనీర్లు,  అదే విదంగా గ్రామీ విన్నింగ్ మ్యూజిషియన్ల సహకారంతో ఈ సౌండ్ గ్యాడ్జెట్ ను రూపొందించినట్లు తింక్ సౌండ్ అధికారిక వర్గాలు ప్రకటించాయి.

ఈ ఇయర్ ఫోన్ ముఖ్య ఫీచర్లు పరిశీలిస్తే.. స్టైలిష్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. 8 mm హై డెఫినిషన్  డ్రైవర్ ను గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేశారు. ఏర్పాటు చేసిన పాసివ్ నాయిస్ ఐసోలేషన్, పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థులు అంతరాయంలేని మన్నికైన సౌండ్ అనుభూతులను శ్రోతకు అందిస్తాయి. ఈ ఇయర్ ఫోన్ల బరవు 9.5 గ్రాములు, పటిష్టమైన పీవీసీ పదార్ధాన్ని  డివైజ్ కేబుల్ నిర్మాణంలో ఉపయోగించారు. ఇయర్ ప్యాడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అవుతాయి. గన్ మెటల్ చాక్ లెట్ కలర్లో ఈ ఇయర్ ఫోన్లు రూపొదించబడ్డాయి. 1 సంవత్సరం వారంటీతో రూ.5,000లకు ఆన్ లైన్ రిటైల్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot