తోడియో ‘ఐ బాక్స్’ చెక్క స్పీకర్లు!!

Posted By: Super

తోడియో ‘ఐ బాక్స్’ చెక్క స్పీకర్లు!!

 

ప్రముఖ సౌండ్ పరికరాల తయారీదారు తోడియో అత్యాధునిక ఐ బాక్స్ వుడెన్ స్పీకర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మన్నికైన సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ స్పీకర్లను టేక్, జీబ్రా, వుడ్, వోక్, పర్పిల్ హార్ట్ చెక్కలతో నిర్మించారు. ఏలాంటి ఒత్తిళ్లనైనా ధీటుగా ఎదుర్కొగల సామర్ధ్యం ‘ఐబాక్స్’ స్పీకర్ సిస్టంలో పొందుపరిచారు. ఈ స్పీకర వ్యవస్థ ద్వారా శ్రోత నాణ్యమైన హై క్వాలిటీ ఆడియోను ఎటువంటి అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చు.

స్పీకర్ చట్టు కొలతలు 34cm x 22cm x 23 cm (L x W x H).బరువు 6.5 కిలోలు. స్పీకర్ల అవుట్ పుట్ సామర్ధ్యం 2 x 70 watts RMS. ఆపిల్ డివైజులకు ఈ స్పీకర్లను జత చేసేకునే విధంగా జాక్ వ్యవస్థను స్పీకర్ పై భాగంలో ఏర్పాటు చేశారు. ఈ డాక్ వ్యవస్థ ద్వారా స్పీకర్ సిస్టంను ఛార్జ్ చేసుకోవచ్చు. డాక్ వ్యవస్థ నిర్మాణంలో మన్నికైన ఆల్యూమినియం మరియు ఫైబర్ ను ఉపయోగించారు.

స్పీకర్లలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ రిసీవర్ వ్యవస్థ సౌలభ్యతతో బ్లూటూత్ ఆధారిత డివైజుల మ్యూజిక్ ఫైళ్లను స్ట్ర్రీమ్ చేసుకోవచ్చు. స్పీకర్ బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం 12 గంటలు. ఏర్పాటు చేసిన ఇండికేటర్ లైట్ వ్యవస్థ ఛార్జింగ్ స్థాయి, బ్లూటూత్ కనెక్టువిటీకి సంబంధించి సూచిక చేస్తుంది. పటిష్టమైన సౌండ్ వ్యవస్థతో ఉత్తమమైన పనితీరునందించే తోడియో ఐ బాక్స్ వుడెన్ స్పీకర్ మార్కెట్ ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot