ఆపిల్ కోసం మరొకరు..?

Posted By: Prashanth

ఆపిల్ కోసం మరొకరు..?

 

ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదండోయ్!!!, ఈ టాప్ బ్రాండెడ్ గ్యాడ్జెట్స్‌కు ఉపకరణాలు సమకూరుస్తామంటూ థర్డ్ పార్టీ తయరీసంస్థలు కోకొల్లలుగా ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తి సంస్థ ‘గావియో’(Gavio) ఆపిల్ ఐఫోన్ కోసం స్పీకర్ డాకింగ్ స్టేషన్‌ను డిజైన్ చేసింది.

ఆకర్షిణీయమైన రూపు రేఖలతో రూపుదిద్దుకున్న ఈ టోస్టర్ స్పీకర్ డాక్ మన్నికైన సౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు గాను డాక్‌లో డ్యూయల్ 50mm స్పీకర్‌‌లతో పాటు 3 వాట్ యాంప్లీఫయిర్‌ను నిక్షిప్తం చేశారు. స్పీకర్ ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన 150Hz నుంచి 18 KHz వరకు. పటిష్టమైన బ్యాకప్ నిచ్చే 1000 mAh లతియమ్ ఐయాన్ బ్యాటరీని డాక్‌లో దోహదం చేశారు.

తక్కువ బరవు కలిగి ఉండే ఈ స్పీకర్ డాక్ ప్రయాణ సందర్భాల్లో పూర్తి స్థాయి వినోదాన్ని మీకు చేరువచేస్తుంది. వాల్యుమ్‌ను ఎడ్జెస్ట్ చేసుకునే విధంగా కంట్రోలింగ్ వ్యవస్థను సౌకర్యవంతమైన స్థానంలో ఏర్పాటు చేశారు. గేవియో రూపొందించిన ఈ టోస్టర్ ఐఫోన్ డాక్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot