ట్రాన్సెండ్ మ్యూజిక్ ప్లేయర్లు ఇప్పుడు అద్వితీయమైన సౌండ్ టెక్నాలజీతో..

Posted By: Super

ట్రాన్సెండ్ మ్యూజిక్ ప్లేయర్లు ఇప్పుడు అద్వితీయమైన సౌండ్ టెక్నాలజీతో..

గ్లోబల్ కంపెనీ ‘ట్రాన్సెండ్ ఇన్ ఫర్ మేషన్’ మల్టీ మీడియా ఉత్పత్తుల పై దృష్టిసారించింది. సంగీత ప్రేమికులకు మరింత చేరువయ్యే క్రమంలో ‘MP300’ కాంపాక్ట్ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ ను మార్కెట్లో విడుదల చేసింది.

మ్యూజిక్ ప్లేయర్ లోని ప్రధానమైన ఫీచర్లను పరిశీలిస్తే ఏర్పాటు చేసిన లితియమ్ పాలిమర్ బ్యాటరీ వ్యవస్థ ‘15’ గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో 15 గంటల పాటు నిరంతరాయంగా శ్రోత సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

ప్లేయర్ బరువు కేవలం 15 గ్రాములు మాత్రమే. ప్లేయర్లో ఏర్పాటు చేసిన కంట్రోలింగ్ వ్యవస్థ ఆధారితంగా సౌండ్, ట్రాకింగ్ తదితర ఆప్షన్లను నియంత్రించుకోవచ్చు. హెడ్ ఫోన్ల సౌలభ్యతతో ప్రైవసీతో కూడిన నాణ్యమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

4జీబీ మరియు 8జీబీ వేరియంట్లలో ఈ మ్యూజిక్ ప్లేయర్ లభ్యమవుతుంది. రెండు సంవత్సరాల వారంటీతో లభ్యమవుతున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ ధర అంశాన్ని పరిశీలిస్తే 4జీబీ వర్షన్ రూ.2,100, 8జీబీ వర్షన్ రూ. 2,600కు ఆడియో స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot