డిజైనింగ్ కేక... సౌండ్ మోత!

Posted By: Prashanth

డిజైనింగ్ కేక... సౌండ్ మోత!

 

బ్లూటూత్ హెడ్‌సెట్‌లను రూపొందించటంలో బ్లూవాయిస్ సంస్థ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. తాజాగా ఈ బ్రాండ్ వాయిస్ ఎస్61 పేరుతో ఓ సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫ్లెక్సిబుల్‌గా డిజైన్ కాబడిన ఈ ఆడియో గ్యాడ్జెట్‌ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతుంది. హెడ్‌సెట్‌ను మెడ వెనుక భాగం నుంచి ధరించాల్సి ఉంటుంది. వీటిని ఫోల్డ్ చేసుకునే సౌలభ్యతను కల్పించారు. ఈ సౌలభ్యత ప్రధానంగా ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

ఆన్, ఆఫ్ బటన్లతో పాటు చార్జింగ్ పోర్టును కుడి ఇయర్ ప్యానెల్ వద్ద ఏర్పాటు చేశారు. పాస్,ప్లే బటన్లను ఎడమవైపు ఉన్న ఇయర్ ప్యానెల్ వద్ద పొందుపరిచారు. అమర్చిన ఎల్‌‌ఈఢి ఇండికేటర్ కనెక్టువిటీ స్థాయి అదేవిధంగా చార్ఝింగ్ నిల్వను సూచిస్తుంది. చార్జ్‌వుతున్నసమయంలో పచ్చ లైట్ వెలుగుతుంది. ప్రక్రియ పూర్తి కాగానే సూచికగా బ్లూ లైట్ ప్రత్యక్షమవుతుంది. హెడ్‌సెట్‌లో అమర్చిన 270ఎమ్ఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ 5 గంటల వర్కింగ్ టైమ్‌తో పాటు 100 గంటల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుంది. ఉత్తమ క్వాలిటీ సౌండ్ వ్యవస్థను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చెయ్యటంతో స్మూత్ అవుట్ పుట్‌ను శ్రోత ఆస్వాదించవచ్చు. బ్లూటూత్ ఆధారిత మొబైల్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లకు ఈ హెడ్‌సెట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ధర అంచనా రూ.2,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot