‘ప్యూర్’ పోర్టబుల్ స్పీకర్ డాక్..!!

Posted By: Super

‘ప్యూర్’ పోర్టబుల్ స్పీకర్ డాక్..!!

 

రేడియో పరికరాలను డిజైన్ చేయటంలో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ప్యూర్’(Pure) అత్యాధునిక పోర్టబుల్ స్పీకర్ డాక్ ను ప్రవేశపెట్టింది. ‘ప్యూర్ కాంటూర్ 100Di’ వర్షన్లలో రూపుదిద్దుకున్న ఈ డాక్ స్పీకర్ట సిస్టంకు ఐఫోన్, ఐపోడ్ పరికరాలను జత చేసుకోవచ్చు.

ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచిన అత్యాధునిక అప్లికేషన్ ‘ఇంటర్నెట్ రేడియో స్టేషన్ల’ను ట్యూన్ చేసుకునే సౌలభ్యతను కల్పిస్తుంది. వెడల్పాటి డిస్ ప్లే వ్యవస్థను డాక్ సిస్టమ్ ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఏ రేడియో స్టేషన్ మనం వింటున్నామో, ఆ స్టేషన్ ఫ్రీక్వెన్సీ, సంబంధిత సమాచారాన్ని ఆ డిస్ ప్లేలో తెలయజేస్తుంది.

రిమోట్ కంట్రోల్ ఆధారితంగా ఈ డివైజును ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ డివైజులలోని ఫీచర్లను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే, ప్యూర్ లాంజ్ అప్లికేషన్ వెబ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంది. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో ప్రపంచ నలుమూలలా విస్తరించి ఉన్న రేడియో స్టేషన్లను ప్రత్యక్షం ప్రసారంతో వినవచ్చు.

నాణ్యమైన ఆడియోను విడుదల చేసే విధంగా, అత్యాధునిక సౌండ్ వ్యవస్థను ఈ ప్యూర్ స్పీకర్లలో నిక్షిప్తం చేశారు. ఈ సౌలభ్యతతో అంతరాయంలేని సంగీతాన్ని శ్రోత నిరంతరాయంగా ఆస్వాదించవచ్చు. ‘ప్యూర్ కాంటూర్ 100Di’ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్పీకర్లో ఏర్పాటు చేసిన ‘ఆక్సిలరీ ఇన్ పుట్ పోర్టు సౌలభ్యత’తో ఇతర ఎంపిత్రీ ప్లేయర్లకు జత చేసుకోవచ్చు. ప్యూర్ సిస్టంలో ఏర్పాటు చేసిన అలారమ్, హెడ్ ఫోన్ సాకెట్, స్నూజ్ తదితర ఫీచర్లు వినియోగదారులకు మరింత లభ్ది చేకూరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot