చెవికి జత చెయ్... గేమ్ ఇరగెయ్!!

Posted By:

చెవికి జత చెయ్... గేమ్ ఇరగెయ్!!

 

అధిక ముగింపు గేమింగ్ హెడ్‌ఫోన్ కోసం చూస్తున్నారా..?, ఈ డివైజ్ వైర్‌లెస్ ఆధారితంగా పనిచేసిదిగా ఉండాలా..? అయితే మార్కెట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన టర్టిల్ బీచ్ XP500ను ఎంపిక చేసుకోండి. స్టాండర్డ్ డిజైన్‌తో ఈ హెడ్‌ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. ఈ గ్యాడ్జెట్ ఇయర్ కప్స్ మన్నికైన పదార్ధంతో తయారు కాబడి చెవులను పూర్తి స్థాయిలో కప్పివేస్తుంది. ఈ సౌలభ్యతతో ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్ ఆడియో ఎఫెక్ట్స్‌ను ఆస్వాదించవచ్చు. బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా ఈ హెడ్‌సెట్‌ను ఇతర డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

హెడ్‌ఫోన్ కీలక ఫీచర్లు:

* వైర్‌లెస్ కనెక్టువిటీ వయా బ్లూటూత్ ఆడాప్టర్ ,

* 7.0 డాల్బీ డిజిటల్ సౌండ్,

* ఉత్తమ క్వాలిటీ ఆడియో ఈక్వలైజర్,

* అద్భుతమైన సౌండ్ క్వాలిటీ,

* సౌకర్యవంతమైన అనుభూతి,

మైనెస్ పాయింట్:

ఉత్తమ క్వాలిటీ సౌండ్ వ్యవస్థతో ఈ హెడ్ ఫోన్ రూపుదిద్దుకున్నప్పటికి బ్యాటరీ వ్యవస్థ నిరుత్సాహానికి గురి చేస్తుంది. డివైజ్ లో యూఎస్బీ ఛార్జింగ్ వ్యవస్థ లోపించటంతో యూస్ అండ్ త్రో AA బ్యాటరీలను ఉపయోగించాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో టర్టిల్ బీచ్ XP 500 ధర రూ.14,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot