వినసొంపైన సౌండ్ క్లారిటీతో ...లగ్జరీ హెడ్ ఫోన్!!

Posted By: Super

వినసొంపైన సౌండ్ క్లారిటీతో ...లగ్జరీ హెడ్ ఫోన్!!

 

ప్రముఖ జర్మన్ హెడ్‌ఫోన్ తయారీ కంపెనీ అల్ర్టా సోన్, హై క్వాలిటీ హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసింది. ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరిస్తూ, మన్నికతో కూడిన ఆధునిక సౌండ్ టెక్నాలజీని ఢివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ‘అల్ర్టా సోన్ సిగ్నేచర్ ప్రో’గా డిజైన్ కాబడిన ఈ సౌండ్ గ్యాడ్జెట్‌ను ప్రముఖ సౌండ్ ఇంజనీర్లు, నిపుణులు, కళకారుల సలహాలు సూచనలతో వ్ళద్థి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి యూఎస్ఏలో లభ్యమవుతున్న ఈ హై ఎండ్ హెడ్‌ఫోన్ ఇండియాకు రావటానికి మరికొంత సమయం పడుతుంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించారు. ఇండియన్ రూపాయిలలో హెడ్‌ఫోన్ ధర రూ.64,000.

క్లుప్తంగా ఫీచర్లు:

* 40 ఎమ్ఎమ్ సౌండ్ స్పెసిఫికేషన్‌తో కూడిన టైటానియమ్ ప్లేటెడ్ ట్రాన్స్ డ్యూసర్ వ్యవస్థ,

* ఫ్రీక్వెన్సీ పరిధి 8 Hz నుంచి 42 KHz వరకు,

* ఉత్తమ సౌండ్ అనుభూతిని కలిగించే ఎస్-లాజిక్ ప్లస్ టెక్నాలజీ,

* ప్రెజర్ లెవల్ 98డెసిబుల్స్ వరకు,

* సున్నితమైన ఇయర్ ప్యాడ్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot