ఖచ్చితమైన క్లారిటీతో ‘వీ-మోడా’!!

Posted By: Super

ఖచ్చితమైన క్లారిటీతో ‘వీ-మోడా’!!

 

ఆడియో పరికరాలకు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో వివిధ రకాల ఉత్పత్తులను ప్రముఖ బ్రాండ్లు విడుదల చేస్తున్నాయి. ప్రైవసీ, సెక్యూరిటీ ప్రధానాంశాలుగా రూపుదిద్దుకున్న హెడ్ సెట్ పరికరాలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీదారు ‘వీ-మోడా’(V-Moda) అత్యాధునిక సౌండ్ పరిజ్ఞానంతో హెడ్ సెట్లను రూపొందించింది.

‘వీ-మోడా క్రాస్ ఫేడ్ LP2’ ఆధునిక వర్షన్లో డిజైన్ కాబడింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన మెటీరియల్ ను ఈ గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు. మన్నికైన పనితీరును కనబర్చే విధంగా 50 mm డ్యూయల్ డైఫార్గమ్ డ్రైవర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీ-పోర్ట్ 3డీ స్టేజింగ్ ఫీచర్ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

31 బ్యాండ్ ఈక్వలైజర్ వ్యవస్థ సౌండ్ పరిమాణాన్ని స్ధాయికి తగ్గట్లు విడుదల చేస్తుంది. హెడ్ ఫోన్ నియంత్రణకు సంబంధించి మూడు బటన్లతో కూడిన మ్యానిపులేషన్ కంట్రోలింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు. ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ ఆధారిత డివైజులకు ఈ పరికరాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ‘వీ-మోడో క్రాస్ ఫేడ్ LP2’ హెడ్ సెట్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.10,000 పై చిులుకే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot