Home
Music

త్వరలో వీడియోకాన్ 4జీ సర్వీస్‌లు

By Prashanth
Videocon 4G


వీడియోకాన్ మొబైల్ సర్వీసెస్ త్వరలో దేశీయంగా 4జీ సర్వీస్‌లను అందించనుంది. కొత్తగా పొందిన సర్కిళ్లలో 2013 ద్వితియాకం నుంచి తమ కొత్త తరం కమ్యూనికేషన్ సర్వీస్‌లతో పాటు ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని వీడియోకాన్ మొబైల్ సర్వీసెస్ డైరెక్టర్ ఇంకా సీఈవో అరవింద్ బాలి పాత్రికేయులకు వెల్లడించారు. తాజా నిర్వహించిన 2జీ స్పెక్ట్రమ్ వేలంలో వీడియోకాన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ (ఈస్ట్ ఇంకా వెస్ట్), బిహార్, జార్కండ్ టెలికామ్ సర్కిళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే రాబోయే ‘4జీ’ 30 రెట్లు వేగవంతంగా స్పందిస్తుందని అరవింద్ బాలి తెలిపారు.

మార్కెట్లోకి ఖరీదైన వీడియోకాన్ స్మార్ట్‌టీవీ!

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్ 65 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో సరికొత్త స్మార్ట్ టీవీని ఆవిష్కరిచింది. ఖరీదు రూ.2,09,990. అత్యాధునిక 3డీ టెక్నాలజీ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 ట్రిలియన్ డిస్‌ప్లే కలర్స్, వోమ్నీ సరౌండ్ సౌండ్, ఫరౌడ్జా వీడియో వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్మార్ట్ టెలివిజన్‌లో ఉన్నాయి. సరికొత్త డీడీబీ ప్లాట్ ఫామ్‌ పై డివైజ్ రన్ అవుతుంది. ఏర్పాటు హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ, ఎంపీత్రీ అవుట్ పుట్ కనెక్టువిటీ ఆప్షన్‌లు యూజర్‌కు మరింత లబ్ధి చేకూరుస్తాయి. హెల్త్ కేర్ వ్యూ, బాడీ మాస్ ఇంటెక్స్ (బీఎమ్ఐ) వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను టీవీలో లోడ్ చేశారు. డీడీబీ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్ టీవీలోనే ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయి 3డీ అనుభూతులతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ స్మార్ట్ టీవీ ఇంటిల్లిపాదికి చేరువచేస్తుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X