సోని, ఫిలిఫ్స్‌లకు ధీటుగా ‘వైలెట్’ హోమ్ థియేటర్..!!

Posted By: Super

సోని, ఫిలిఫ్స్‌లకు ధీటుగా ‘వైలెట్’ హోమ్ థియేటర్..!!


‘‘ఎలక్ట్రానికి పరికరాల మార్కెట్లో దిగ్గజ శ్రేణులైన సోని, ఫిలిఫ్స్‌లు వినియోగదారులు గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. అయితే, బెంగుళూరు చెందిన స్నాప్ నెట్‌వర్క్ సంస్థ ‘వైలెట్’ హోమ్ థియేటర్ వ్యవస్థను విడుదల చేసి భారతీయులు సాంకేతిక ప్రతిభను చాటుకుంది. 3డీ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సౌండ్ సిస్టమ్ పూర్తిగా ఇండియాలోనే రూపుదిద్దుకుంది. అత్యాధినక వ్యవస్థతో తయారైన ఈ ఆడియో పరికరం దిగ్గజ బ్రాండ్లకు పోటీగా నిలుస్తుందిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.’’

క్లుప్తంగా పీచర్లు:
- సాధారణంగా హోమ్ ధియేటర్లను పరిశీలిస్తే, వైర్లు ఆధారితంగా పనిచేస్తుంటాయి. వైర్లు కాస్తంత కదిలినా సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ‘వైలెట్’ హోమ్ ధియేటర్ వైర్‌లెస్ ఆధారితంగా పనిచేస్తుంది. అంతేకాందండోయ్.. మీ టీవి గదికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
- సౌండ్ నాణ్యతను పరిశీలిస్తే దిగ్గజ బ్రాండ్లైన సోని, ఫిలిఫ్స్, ప్యానాసానిక్‌లకు ధీటుగా సౌండ్ వ్యవస్థను పొందుపరిచారు.
- 5.1 సరౌండ్ స్పీకర్ వ్యవస్థ ఇంట్లోనే థియేటర్ అనుభూతిని కలిగిస్తుంది.
- వైర్లతో నిమిత్తం లేకుండా పనిచేసే స్పీకర్లను ఇంటి అవరణలో ఏ గదిలోనైనా అమర్చుకోవచ్చు.
- హై డెఫినిషన్ సినిమాలతో పాటు 3డీ చిత్రాలను నాణ్యమైన సౌండ్‌తో వీక్షించవచ్చు.
- తక్కువ బరువు కలిగి ఉండే స్పీకర్లు నాణ్యమైన వ్యవస్థతో రూపొందించారు.
- వైలెట్ హోమ్ సిస్టమ్ ధర రూ.65000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot