డీవీడీ వీడియోను హై డెఫినిషన్ వీడియోగా మార్చేస్తుంది.!!

Posted By: Super

డీవీడీ వీడియోను హై డెఫినిషన్ వీడియోగా మార్చేస్తుంది.!!

 

మార్కెట్లో ‘బ్లూరే’ ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పటికి ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. సమజంసమైన ధరకే మన్నికైన ‘బ్లూరే’ డివైజును సొంతం చేసుకోవాలనుకునే వారికి ‘Vizio’ సంస్థ అత్యాధునిక సాంకేతికతతో VBR122 వర్షన్లో బ్లూరే ప్లేయర్ ను ప్రవేశపెట్టింది. వెర్ లెస్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వ్యవస్థను ఈ ప్లేయర్లో ఏర్పాటు చేసింది. ఈ ‘బ్లూరే ప్లేయర్’ సౌలభ్యతతో సినిమాలు లేదా వీడియోలను హై క్లారిటీతో తిలకించవచ్చు. స్లాండర్డ్ డెఫినిషన్ డీవీడీ విడియోలను సైతం ఈ ప్లేయర్

హై డెఫినిషన్ వీడియోలకు మలుస్తుంది.

హై -డెఫినిషన్ టీవీలకు మాత్రమే ఈ ప్లేయర్ ను జత చేసుకునే సౌలభ్యతను కల్పించారు. HDMI కేబుల్ ద్వారా ఈ అనుసంధాన ప్రక్రియ సాధ్యమవుతుంది. డిస్క్ లోడింగ్ సమయం ఒక్క నిమిషం. ఇంటర్నెట్ స్ట్ర్రీమింగ్ వీడియో అప్లికేషన్లను ప్లేయర్లో నిక్షిప్తం చేశారు. స్ట్ర్రీమింగ్ వీడియో సర్వీసులైన నెఫ్లిక్స్, పండోరా, యూ ట్యూబ్ తదితర ఫీచర్లను ముందుగానే అప్ లోడ్ చేశారు.

యూఎస్బీ స్టోరేజి డివైజులైన పెన్ డ్రైవ్ తదితర డేటా స్టోరేజి పరికరాలను ఈ ప్లేయర్ కు జత చేసుకోవచ్చు. Mp3, AAC ఫార్మాట్లలో ఉన్న మ్యూజిక్ ఫైళ్లతో పాటు, JPG, PNG ఫార్మాట్లలో ఉన్న వీడియో ఫైళ్లను ఈ డివైజులో ప్లే చేసుకోవచ్చు. బహుముఖంగా ఉపయోగపడే విధంగా అత్యాధునిక రిమోట్ కంట్రోల్ వ్యవస్థను ఈ ప్లేయర్ కోసం రూపొందించారు. రిమోట్ కంట్రోల్ ఒక వైపు ప్లేయర్ ను నియంత్రించే బటన్లను ఏర్పాటు చేయగా, మరో వైపు ఇంటర్నెట్ ను ఆపరేట్ చేసుకునే విధంగా ఫుల్ సైజు కీబోర్డును ఏర్పాటు చేశారు. భారతీయ మార్కెట్లో ఈ అత్యాధునిక బ్లూరే డిస్క్ ప్లేయర్ ధర రూ.6000 ఉండొచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot