వార్ఫిడేల్ ‘హై-ఫై ’ హోమ్ ధియోటర్ సిస్టం...

Posted By: Staff

వార్ఫిడేల్  ‘హై-ఫై ’ హోమ్ ధియోటర్ సిస్టం...

 

ఎంటర్‌టైన్‌మెంట్... ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటిల్లిపాది హోల్‌సేల్‌గా కోరకుంటున్న  మోస్ట్ వాంటెడ్  అవసరం. ఈ అవసరాన్ని అనేక సాధనాలు తీరుస్తున్నప్పటికి మ్యూజిక్  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టెక్నాలజిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో రోజుకో కొత్త రకం మ్యూజిక్ గ్యాడ్జెట్ అందుబాటులోకి వస్తుంది.

ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు ‘వార్ఫిడేల్’ (Wharfedale) శక్తవంతమైన  హై-ఫై హోమ్ ధియోటర్ సిస్టంను రూపొందించింది. ‘ఒబ్సిడియన్  600’ వర్షన్ లో విడుదలైన ఈ  హై-ఫై హోమ్ ధియోటర్ ఆడియో ప్రేమికులు అవసరాలను

తీర్చటంలో సఫలీకృతమవుతుంది.. ఫీచర్లు క్లుప్తంగా...

ఈ సిస్టంలో ఐదు స్పీకర్ సెట్స్ ఉంటాయి,  రెండు ఫ్లోర్ స్టాండ్స్,  రెండు శాటిలైట్ స్పీకర్లు, ఒక సెంటర్ ఛానెల్ స్పీకర్, గోల్డ్ ప్లేటెడ్ కనెక్టర్స్.  స్పీకర్ సిస్టంకు  ‘డైమెండ్ SW150 సబ్ ఊఫర్’ను జత చేసుకున్నట్లయితే మరంత ఖచ్చితమైన  హై క్వాలిటీ సౌండ్‌ను మీరు వినగలుగుతారు.  డైమెండ్ SW150 సబ్ ఊఫర్ సౌండ్ అవుట్ పుట్ సామర్ధ్యం 150W RMS.

‘ఒబ్సిడియన్  600’ ఫీచర్లు:

- ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్లలో 4 డ్రైవర్లను ఏర్పాటు చేశారు. రెండు o30 mm సైజ్ మిడ్ రేంజ్ డ్రైవర్లు కాగా, ఒకటి 25mm ట్వీటర్, 200 mm వూఫర్.

- శాటిలైట్ స్పీకర్లో ఒక 25 mm, 100 mm డ్రైవర్ ను పొందుపరిచారు.

- అత్యాధునిక హై -క్వాలిటీ ఆడియో వ్యవస్థను ఈ సిస్టంలో నిక్షిప్తం చేశారు. ధర రూ.70,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting