హై డెఫినిషన్ మ్యూజిక్!!!

Posted By: Super

హై డెఫినిషన్ మ్యూజిక్!!!

 

ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీదారు ‘వూఫ్సన్ మైక్రో ఎలక్ట్ర్రానిక్స్’ రెండు హై డెఫినిషన్ (HD) మ్యూజిక్ డివైజులను ఈ ఏడాది ప్రధమాంకంలో వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ల్యాప్‌టాప్  ఇతర కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లకు  ఈ మ్యూజిక్ డివైజ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. WM8862, WM8861 మోడల్స్‌‌లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లు సాధరాణ మ్యూజిక్ సిస్టంతో పోలిస్తే 5 రెట్లు నాణ్యతతో కూడిన ఆడియో అనుభూతిని కలిగిస్తాయి.

ఉన్నత ప్రమాణాలతో కూడిన ‘వూఫ్సన్ క్లారిటీ ఆడియో సాఫ్ట్‌వేర్’వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టంలో పొందుపరిచారు. నిక్షిప్తం చేసిన  డైనమిక్ రేంజర్ కంట్రోలర్స్, హై స్పీకర్ ఫ్రీక్వెన్సీ అంశాలు అన్ని రకాల సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ రెండు గ్యాడ్జెట్లలో ఏర్పాటు  చేసిన మ్యూజిక్ డిటెక్షన్ వ్యవస్థ  ఏ విధమైన హెడ్‌సెట్‌నైనా జత చేసుకునేందుకు ఉపకరిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot