వూఫ్సన్ సారధ్యంలో అద్భుతం ‘2012’..?

Posted By: Staff


వూఫ్సన్ సారధ్యంలో అద్భుతం ‘2012’..?

నవ వసంతం ‘2012’లో ఓ అద్భుతాన్ని చూసేందుకు మీరు సిద్ధమేనా..?, మ్యూజిక్ ప్రపంచంలో వస్తున్న పెను మార్పును ఆస్వాదించేందుకు రెఢీనా..?

ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీదారు ‘వూఫ్సన్ మైక్రో ఎలక్ట్ర్రానిక్స్’ రెండు హై డెఫినిషన్ (HD) మ్యూజిక్ డివైజులను 2012 ప్రధమాంకంలో వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ల్యాప్ టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్ (పీసీ)లకు జత చేసేకునే విధంగా రూపకల్పన చేస్తున్నారు.

WM8862, WM8861 మోడల్స్ లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లు సాధరాణ మ్యూజిక్ సిస్టంతో పోలిస్తే 5 రెట్లు నాణ్యతతో కూడిన ఆడియో అనుభూతిని కలిగిస్తాయి. ఉన్నత ప్రమాణాలతో కూడిన ‘వూఫ్సన్ క్లారిటీ ఆడియో సాఫ్ట్ వేర్’వ్యవస్థను ఈ మ్యూజిక్ పరికరాల్లో పొందుపరిచారు. డైనమిక్ రేంజర్ కంట్రోలర్స్, హై స్పీకర్ ఫ్రీక్వెన్సీ అంశాలు అన్ని రకాల సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా ఈ రెండు గ్యాడ్జెట్లలో ఏర్పాటు ‘మ్యూజిక్ డిటెక్షన్’ వ్యవస్థ ఏ విధమైన హెడ్ సెట్ నైనా జత చేసుకునేందుకు ఉపకరిస్తుంది. మాస్టర్ I2S ఆడియో, I2C/SPI కంట్రోలర్ ఇంటర్ ఫేస్, డిజిట్ యాంఫ్లీ ఫైర్ వంటి ఫీచర్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఆధునిక హై డెఫినిషన్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘వూఫ్సన్’ మ్యూజిక్ గ్యాడ్జెట్లు డిసెంబర్ లో ట్రెయిల్ వర్షన్లో మార్కెట్లోకి రానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot