‘ఎక్స్ పీ’ ఐప్యాడ్ స్పీకర్!!

Posted By: Prashanth

‘ఎక్స్ పీ’ ఐప్యాడ్ స్పీకర్!!

 

ప్రయాణ సందర్భాల్లో టాబ్లెట్ పీసీ ద్వారా నాణ్యమైన మ్యూజిక్‌ను ఆస్వాదించాలంటే రెండే ప్రధాన మార్గాలు ఒకటి హెడ్ ఫోన్స్ ద్వారా మరొకటి ఇంటిగ్రేటెడ్ స్పీకర్ల ద్వారా, టాబ్లెట్ పీసీలలో నిక్షిప్తం చేసే ఇన్‌బుల్ట్ స్పీకర్ల సామర్ధ్యం తక్కువ ఉండటం కారణంగానే ఈ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవల్సి వస్తుంది. టాబ్లెట్ పీసీకి ఎడిషనల్ స్పీకర్లకు జత చేసుకునే క్రమంలో కొంత స్థలాన్ని కేటాయించాల్సి వస్తుంది.

ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఐమెయిన్ గో (iMainGo) సంస్థ XP స్పీకర్ సిస్టంను డిజైన్ చేసింది. ఆపిల్ ఐప్యాడ్ కు ఈ స్పీకర సిస్టంను జత చేసుకోవచ్చు. ఫోల్డెడ్ కేస్ (పౌచ్) ఆకృతిలో డిజైన్ కాబడిన ఈ స్పీకర్ సిస్టం ‘ఐప్యాడ్’కు రక్షణ కవచంలా నిలవటంతో పాటు క్లారిటీతో కూడిన ఖచ్చితమైన ఆడియోను విడుదల చేస్తుంది.

ఈ స్పీకర్ ముఖ్యాంశాలు:

* పౌచ్ ఆకృతిలో డిజైన్ కాబడిన స్పీకర్ సిస్టంలో నాలుగు శక్తివంతమైన టిటానియమ్ కోన్డ్ నియోడైమియమ్ స్పీకర్లను నిక్షిప్తం చేశారు, * ఆడిషనల్ జాక్ సౌలభ్యత, * సింగిల్ ఛార్జ్, * బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు, * రెండు 3.5mm ఆడియో జాక్స్, * ధర రూ.6,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot