రయ్ మంటూ దూసుకొస్తున్న ‘యమహా’!!

Posted By: Staff

రయ్ మంటూ దూసుకొస్తున్న ‘యమహా’!!

మీమ్మల్ని షేకాడించేందుకు ‘యమహా’ స్టీరియో టర్బోనేటర్ రయ్ మంటూ దూసుకొచ్చింది. ఆ సౌండ్ గ్యాడ్జెట్ల సైయ్యాటలో మునిగితేలేందుకు మీరు సిద్ధమేనా......

ఆడియో పరికరాల తయారీలో విశ్వసనీయ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘యమహా’ రెండు సరికొత్త హై క్వాలటీ స్టీరియో గ్యాడ్జెట్లను విడుదల చేసింది. MCR 332, MCR-232 వేరియంట్లలో రూపుదిద్దుకున్న ‘డాక్’ ఆడియో పరికరాలను ఐపోడ్లు, ఐఫోన్లతో పాటు ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు జత చేసుకోవచ్చు.

ఇతర ఎంపత్రీ ప్లేయర్లకు కనెక్టు చేసుకునే విధంగా యూఎస్బీ పోర్టులను గ్యాడ్జెట్లలో ఏర్పాటు చేశారు. సౌండ్ వ్యవస్థను మరింత పటిష్ట పరిచే విధంగా AUX-in టెర్మినల్స్ తో పాటు సబ్ ఊఫర్ పోర్టులను గ్యాడ్జెట్లలో పొందుపరిచారు.

పియానో క్రాఫ్ట్ మైక్రో కాంపోనెంట్ వ్యవస్థను ఈ పరికరాల్లో పొందుపరిచారు. CRX-332 CD రిసీవర్ వ్యవస్థను రెండు గ్యాడ్జెట్లలో ప్రవేశపెట్టారు. టూవే బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు నాణ్యమైన అవుట్ పుట్ ను అందిస్తాయి. ఇతర వైబ్రేషన్లతో పాటు సౌండ్ అంతరాయాలను ఈ స్పీకర్లు నియంత్రించగలవు.

ఆడ్వాన్సడ్ ‘వైబ్రేషన్ కంట్రోల్ క్యాబినెట్’ వ్యవస్థ స్పీకర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రిమోట్ కంట్రోల్ ఆధారింతగా ఈ గ్యాడ్జెట్లను నియంత్రించే అవకాశాన్ని కల్పించారు. అత్యాధునిక సౌండ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ డాక్ గ్యాడ్జెట్ల ధరలను పరిశీలిస్తే ‘యమహా MCR-332’ రూ.20,000, ‘యమహా MCR-232’ రూ.17,500కు లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot