దేశ ప్రజలకు 'యమహా' మ్యూజిక్ ఆఫర్

Posted By: Super

దేశ ప్రజలకు 'యమహా' మ్యూజిక్ ఆఫర్

'యమహా' భారతదేశ ప్రజలకు రెండు విధాలుగా పరిచయం. ఒకటి ఎలక్టానిక్స్ రంగం, రెండవది ఆటోమొబైల్ రంగం. ఈ రెండు రంగాలలో అత్యుత్తమైన ఉత్పత్తులను విడుదల చేస్తుంది యమహా కంపెనీ. కొన్ని సంవత్సరాల నుండి కూడా నాణ్యమైన ఉత్పత్తలను కస్టమర్స్‌కి అందజేస్తుంది. కొత్తగా మార్కెట్లోకి యమహా నుండి సూపర్ క్వాలిటీ స్పీకర్ సిస్టమ్ 'యమహా పిడిఎక్స్-60బిఎల్' డాకింగ్ స్పీకర్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ డాకింగ్ స్పీకర్ సిస్టమ్‌ని మీయొక్క ఐఫోన్, ఐప్యాడ్‌లకు అనుసంధానం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

'యమహా పిడిఎక్స్-60బిఎల్' డాకింగ్ స్పీకర్ సిస్టమ్‌లో చెప్పుకొదగ్గ ఫీచర్ వైర్ లెస్ ఛార్జింగ్ క్రాడిల్ ఫీచర్. ఇందులో నుండి వచ్చేటటువంటి సౌండ్ క్వాలిటీకి కస్టమర్స్ మంత్రముగ్దులు అవుతారని తెలిపారు. ఈ వైర్ లెస్ ఛార్జింగ్ క్రాడిల్‌ని కంట్రోల్ చేసేందుకు వీలుగా రిమోట్ కంట్రోల్‌ని కూడా రూపొందించడం జరిగింది. 'యమహా పిడిఎక్స్-60బిఎల్' హార్ట్ వేర్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనియొక్క ఫ్రీక్వెన్సీ రేంజి 60Hz to 20 KHz వరకు ఉంటుంది. ఈ స్పీకర్స్‌‌తో పాటు బాస్ రిఫ్లెక్స్ స్పీకర్స్ ఉచితం.

'యమహా పిడిఎక్స్-60బిఎల్' వచ్చేటటువంటి డ్యూయల్ 3-1/4 ఇంచ్ పుల్ రేంజి వూపర్స్ చక్కని బాస్ ఎపెక్ట్స్‌ యూజర్స్‌కు అందిస్తాయి. 'యమహా పిడిఎక్స్-60బిఎల్' స్పీకర్స్ మొత్తం బరువు 3.7 lbs. స్పీకర్స్‌తో పాటు అదనంగా ఎసి ఎడాప్టర్ అందివ్వడం జరుగుతుంది. 'యమహా పిడిఎక్స్-60బిఎల్' స్పీకర్స్‌కు అనుసంధానంగా మూడు డాక్ ఎడాప్టర్స్, సౌండ్ పెంచుకొవడానికి, తగ్గించుకొవడానికి వేరే ఇతర ఫంక్షనాలిటీ నిమిత్తం రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. ఈ స్పీకర్ సిస్టమ్‌ని ఖచ్చితంగా టేబుల్‌కి సరిపోయే విధంగా రూపొందించడం జరిగింది.

ఇక స్పీకర్స్ కలర్ విషయంలో యమహా చాలా జాగ్రత్త తీసుకొని తయారు చేయడం జరిగింది. బాడీ ప్యానల్ మొత్తానికి బ్లాక్ కలర్ వేయడం జరిగింది. బ్లూ, పింక్, గ్రే కలర్స్‌లలో కూడా మార్కెట్లో ఈ స్పీకర్స్ లభించనున్నాయి. చూడడానికి దీర్ఘచతురస్రాకారంలో అందంగా ఈ స్పీకర్స్‌ని తీర్చిదిద్దడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 12,000గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot