100 వాట్ల విద్యుత్ మీలో ప్రవహిస్తే..?

Posted By: Prashanth

100 వాట్ల విద్యుత్ మీలో ప్రవహిస్తే..?

 

‘ఆ మ్యూజిక్ స్పందనలు ఒక్కసారిగా మీలో ఉత్సాహాన్ని నింపుతాయి.. 100 వాట్ల విద్యుత్ ప్రవాహం మిమ్మల్ని చుట్టుముడుతుంది.. గుండె సౌండ్ బాణి మారుతుంది.. అనుకోకుండానే ఆ బీట్‌కు మీ చిందులు మొదలువుతాయి’

ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు ‘యమహా’(Yamaha) సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘రిస్టియో ISX-800’ (Restio ISX-800) పేరుతో అత్యాధునిక మ్యూజిక్ సిస్టంను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కాంపాక్ట్ సైజులో డిజైన్ కాబడ్ద ఈ లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్ వినయోగదారులను తప్పక మైమరిపిస్తుంది.

ఈ మ్యూజిక్ సిస్టం ఫీచర్లను పరిశీలిస్తే, సీడీ ప్లేయర్ సౌలభ్యత, ఐపోడ్, ఐఫోన్ పరికరాలకు జత చేసుకునే విధంగా డాక్ సౌలభ్యత, ఆల్ఫా న్యూమరిక్ డిస్ ప్లే, హై క్వాలిటీ స్పీకర్లు, శక్తివంతమైన యాంప్లీఫయర్, ఎఫ్ఎమ్ ట్యూనర్, యూఎస్బీ పోర్టు సౌలభ్యత, ఆలారమ్ క్లాక్, రిమోట్ కంట్రోల్ అంశాలు ఉపయుక్తంగా నిలుస్తాయి. ఈ మ్యూజిక్ సిస్టంలో పొందుపరిచిన అత్యుత్తమమైన సౌండ్ వ్యవస్థ సంగీతాన్ని నాణ్యమైన కోణంలో రూమ్ అంతా విస్తరింప జేస్తుంది.

‘రిస్టియో ISX-800’ మ్యూజిక్ సిస్టం మార్కెట్ ధర రూ.40,000 పై చిలుకే. గ్రీన్, పర్పిల్, బ్లాక్, వైట్ రుంగుల్లో ఆడియో గ్యాడ్జెట్ లభ్యమవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting