యమహా హోమ్ ధియోటర్ స్పీకర్ సిస్టమ్!!

Posted By: Super

యమహా హోమ్ ధియోటర్ స్పీకర్ సిస్టమ్!!

అంతర్జాతీయ ‘ఆటోమొబైల్ మరియు ఆడియో గ్యాడ్జెట్ల’ మార్కెట్లో హై క్వాలిటీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘యమహా’ (Yamaha) అత్యాధునిక సౌండ్ బార్ సిస్టమ్ ను మార్కెట్లో విడుదల చేసింది. స్పీకర్లో ఏర్పాటు చేసిన ‘సబ్ ఊఫర్ ఇంటిగ్రేటెడ్ రీసీవర్’ శ్రోతకు ఇంపైన సంగీతానుభూతికి లోనుచేస్తుంది. డివైజ్ లో పొందుపరిచిన 7.1 విర్ట్యుల్ సరౌండ్ సౌండ్ వ్యవస్థ రియాల్టీ సౌండ్ అనుభూతికి లోను చేస్తుంది.

‘యమాహా YHT-S401’లో వూఫింగ్ సిక్స్ సరౌండ్ మోడ్ వ్యవస్థను పొందుపరిచారు. మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్, గేమ్స్, టీవీ పోగ్రామ్ మోడ్, స్టాండర్డ్ మోడ్ వంటి అంశాలు ధియోటర్ సౌండ్ అనుభూతితో కూడిన క్లారిటీని అందిస్తాయి.

ఎఫ్ఎమ్ ట్యూనర్, డిజిటల్ యూఎస్బీ కనెక్షన్, ఆడియో రిటర్న్ ఛానెల్, 3డీ వీడియో ఫీచర్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఏర్పాటు చేసిన HDMI 3-in-1 పోర్టు 1080p రిసల్యూషన్ ను సపోర్టు చేస్తుంది. అంతరాయంలేని సంగీతాన్ని ధియోటర్ అనుభూతితో అందించే విధంగా డిజైన్ కాబడిన ‘యమహా YHT-S401 సౌండ్ బార్ స్పీకర్ సిస్టమ్’ ధర రూ..35, 000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot