ఇక సీడీ, డీవీడీ ఫ్లేయర్లకు నమస్కారం పెట్టండి..!!

Posted By: Super

ఇక సీడీ, డీవీడీ ఫ్లేయర్లకు నమస్కారం పెట్టండి..!!


‘‘ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ స్పీకర్లతో, ఇప్పుడిక మ్యూజిక్‌ను కొత్త కోణంలో ఎంజాయ్ చేయండి. సంగీత ప్రేమికుల కోసం జీబ్రానిక్స్ (Zebronics’) ప్రవేశపెట్టిన సరికొత్త మల్టీ మీడియా స్పీకర్లు సంగీత ప్రపంచంలో ఊగిసలాడిస్తాయి. ఆధునిక సాంకేతిక హంగులతో రూపొందించబడిన ఈ స్పీకర్లకు సీడీ, డీవీడీ ఫ్లేయర్లను అనుసంధానించాల్సిన అవసరం లేదు. స్పీకర్లలో ఏర్పాటు చేసిన యూఎస్బీ పోర్టు వ్యవస్థ మీ పెన్ డ్రైవ్, మెమరీ కార్డుల్లో స్టోర్ అయివున్న పాటలను నాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తుంది. ఇన్ని హంగలు కలిగి ఉన్న ఈ పరికరం అధిక ధరను కలిగి ఉండోచ్చన్న సందేహం రావచ్చు. మీ సందేహాలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయండి, ఎందుకంటే జీబ్రానిక్స్ అతి తక్కువ ధరలకే ఈ నాణ్యమైన స్పీకర్లను ప్రవేశపెడుతుంది.’’

ఫీచర్లు క్లుప్తంగా:

- జీబ్రానిక్స్ ప్రవేశపెట్టబోతున్నఈ మల్టీ మీడియా స్పీకర్లు 2.1, 4.1 సౌండ్ వేరియంట్లలో లభ్యమవుతాయి.
- 2.1 స్పీకర్లతో పోలిస్తే 4.1 సామర్థ్యం గల స్పీకర్లు శక్తివంతమైన వ్యవస్థను కలిగి ఉంటాయి.
- 2.1, 4.1 స్పీకర్లలో యూఎస్బీ పోర్టు (2.0 వర్షన్)తో పాటు ఎస్డీ కార్డ్‌లు పెట్టుకునేందుకు మెమరీ స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యత ద్వారా పెన్ డ్రైవ్, మెమరీ కార్డులను స్పీకర్ పోర్టులకు అనుసంధానం చేసుకుని నాణ్యమైన సంగీతాన్ని వినవచ్చు.
- ప్రత్యేక ఆకర్షణగా ఈ స్పీకర్లలో ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థను పొందుపరిచారు.
- రిమోట్ ఆధారితంగా పనిచేసే ఈ స్పీకర్లు, మీరు కోరుకున్న విధంగా సంగీతాన్ని అందిస్తాయి.
- స్పీకర్లలో అనుసంధానించిన సబ్‌వూఫర్, శాటిలైట్ ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు సినిమా థియోటర్‌లో పొందిన సౌండ్ అనుభూతిని వినియోగదారులకు అందిస్తాయి.
- వీటి ధరలను పరిశీలిస్తే 2.1 స్పీకర్లు రూ.1700, 4.1 స్పీకర్లు రూ.2100కే సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot