బీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్!

Posted By: Prashanth

బీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్!

 

ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోట్రానిక్స్(Infotronix), జీబ్రానిక్స్ బ్రాండ్ క్రింద ‘జిబ్‌మేట్ సినిమా 1.8’(Zebmate Cinema 1.8) పేరుతో సరికొత్త అల్ట్రా - లైట్ టచ్‌స్ర్కీన్ మీడియా ప్లేయర్‌ను విడుదల చేసింది. ఉత్తమ శ్రేణి ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఈ మీడియా ప్లేయర్‌లో ఒదిగి ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే.....

- 1.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్160× 128పిక్సల్స్),

- 8జీబి ఇన్‌బుల్ట్ మెమరీ,

- స్కై బ్లూ కలర్ బాడీ డిజైనింగ్,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

- శక్తివంతమైన బ్యాటరీ (12 గంటల పాటు నిరంతరాయంగా పాటలను వినొచ్చు),

- వీడియోలను క్వాలిటీతో వీక్షించే సౌలభ్యత,

- ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్,

- టెక్స్ట్ ఇంకా ఇమేజ్,

- ఆడియో రికార్డింగ్,

- ఈజీ టచ్ ఆప్షన్స్,

- ఆడియో ఫార్మాట్స్ (MP3, WAV, WMA),

- హైక్వాలిటీ ఇయర్ ఫోన్స్,

- యూఎస్బీ 2.0 కేబుల్,

- ఈక్వలైజర్ ఆప్షన్స్,

- ఫోటో వ్యూవింగ్ ఆప్షన్,

- ఈ-బుక్ రీడింగ్.

ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్ లలో ఈ మ్యూజిక్ ప్లేయర్ లభ్యం కానుంది. ధర రూ.1600.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot