‘జీబ్రానిక్’ స్పీకర్లు ఇప్పుడు రూ.999/-కే

Posted By: Super

‘జీబ్రానిక్’ స్పీకర్లు ఇప్పుడు రూ.999/-కే


‘‘కంప్యూటర్ ఆధారిత పరికరాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ‘జీబ్రానిక్స్’ సంస్ధ, ‘జెబ్ స్టేషన్ లైట్’ పేరుతో పోర్టబుల్ స్పీకర్లను అతి తక్కువ ధరకే సంగీత ప్రియులకు అందించనుంది. అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో కేవలం రూ.999/-కే ప్రముఖ షోరూమ్‌లలో లభ్యమవుతున్న ఈ స్పీకర్లు బ్యటరీ వ్యవస్ధ ఆధారితంగా పని చేస్తాయి.

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆడియో వ్యవస్థ సపోర్టు చేసే అన్ని పరికరాలకు ఈ స్పీకర్లను అనుసంధానం చేసుకోవచ్చు.
- అత్యాధునిక యూఎస్బీ పోర్టుతో పాటు SD/MMC కార్డులను సపోర్టు చేసే విధంగా స్లాట్ల్‌ను స్పీకర్ వ్యవస్థలో ఏర్పాటు చేశారు.
- ఇన్‌బుల్ల్ ‘ఎఫ్‌ఎమ్’ రేడియోతో పాటు ట్యూనింగ్ వ్యవస్థలు స్పీకర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- స్పీకర్లలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే వింటున్న సంగీత వివరాలను క్లుప్తంగా డిస్‌ప్లే చేస్తుంది.
- వివిధ ఆడియో పరికరాలతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ వంటి అత్యాధునిక వ్యవస్థలకు A/V కేబుల్ సాయంతో స్పీకర్లను అనుసంధానించుకోవచ్చు.
- స్పీకర్లలో పొందుపరిచిన నాణ్యమైన ఊఫర్ వ్యవస్థ వినసొంపైన సంగీతాన్ని నాణ్యమైన పాళ్లలో శ్రోతకు అందిస్తుంది.
- స్పీకర్ల నిర్మాణంలో ఉపయోగించిన సాలిడ్ వ్యవస్థ అనవసర వైబ్రేషన్ల నుంచి స్పీకర్లను సురక్షిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot