జీబ్రానిక్స్ నుంచి సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్స్!

Posted By: Prashanth

జీబ్రానిక్స్ నుంచి సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్స్!

 

కంప్యూటర్ ఉపకరణాలను ‘జీబ్రానిక్స్’ బ్రాండ్ కింద విక్రయించే టాప్ నాట్స్ ఇన్ఫోట్రానిక్స్ ( Top Notch Infotronix)..కేవలం 7 గ్రాముల బరువుతో కూడిన బ్లూటూత్ హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేరు ‘జడ్ఈబి-బిహెచ్500’.ఈ డివైజ్ బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్న మొబైల్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ అలాగే మీడియా ప్లేయర్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను హ్యాండ్స్ ఫ్రీమోడ్ అలాగే స్టీరియో మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతుంది. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన లితియమ్ ఐయాన్ బ్యాటరీ సుధీర్ఘ బ్యాకప్‌ను అందిస్తుంది. వినూత్న డిజైన్‌తో రూపొందించబడని ఈ తక్కువ బరువు డివైజ్ అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని విడుదల చేస్తుందని ఇన్ఫోట్రానిక్స్ ఇండియా సంచాలకులు రాజేష్ దోషి తెలిపారు.

‘జడ్ఈబి-బిహెచ్500’ కీలక ఫీచర్లు:

తక్కువ బరువు,

బ్లూటూత్ ఫీచర్,

మోనో హ్యాండ్స్ ఫ్రీ మోడ్,

వాల్యుమ్ కంట్రోల్,

రీచార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 2.5 గంటలు, 85గంటల స్టాండ్‌బై),

బ్లూటూత్ సాంధ్రత 10 మీటర్లు,

ఒక సంవత్సరం వారంటీ,

యూఎస్బీ చార్జింగ్ కేబుల్,

ప్రముఖ ఐటీ స్టోర్‌లలో ఈ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను రూ.449కి విక్రయిస్తున్నారు.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting