ఇప్పుడు దూరం కూడా దగ్గరే..!!

Posted By: Staff

ఇప్పుడు దూరం కూడా దగ్గరే..!!

 

ప్రముఖ మ్యాజిక్ గ్యాడ్జెట్ల సంస్థ ‘స్పార్’(Spar) జిఫైర్ కుటుంబాన్ని విస్తరించింది. తాజాగా జిఫైర్ (Zephyr) వర్షన్లో మూడు బ్లూటూత్ స్పీకర్లను సంస్థ విడుదల చేసింది. జిఫైర్ 550, 500, 300 వేరియంట్లలో ఈ బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు లభ్యమవుతున్నాయి. ‘హై క్లారిటీ’ ఆడియోను శ్రోతకు అందించే లక్ష్యంగా స్పార్ తాజా మ్యూజిక్ గ్యాడ్జెట్లను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

ఈ స్పీకర్లను సలువుగా ఎక్కడికైనా క్యారీ చేయ్యవచ్చు. ఐఫోన్ ఇతర బ్లూటూత్ డిజిటల్ డివైజులకు ‘జిఫైర్’ స్పీకర్లను జత చేసుకోవచ్చు. ఈ స్పీకర్ మీ చెంతనుంటే ఇయర్ ఫోన్లు పెట్టుకునే బెడత తగ్గినట్లే.

క్లుప్తంగా ‘జిఫైర్ 550’ ఫీచర్లను పరిశీలిస్తే.. శక్తివంతమైన ‘బీటీ క్లాస్ 2.1V బ్లూటూత్’ సాంధ్రత 33 అడుగుల సామర్ధ్యం ఉంటుంది. ఏర్పాటు చేసిన 3000 mA లితియమ్ బ్యాటరీ వ్యవస్థ 30 గంటల పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పొందుపరిచిన హై క్లారిటీ సౌండ్ వ్యవస్థ శ్రోతకు మరింత లబ్ధి చేకూరుస్తుంది.

‘జిఫైర్ 500’ ఫీచర్లను పరిశీలిస్తే మన్నికైన సౌండ్ వ్యవస్థను పొందుపరిచారు. పటిష్ట బ్లూటూత్ వ్యవస్థ అంతరాయం లేని సిగ్నలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పొందుపరిచిన 1500 mA లితియమ్ పాలిమర్ బ్యాటరీ 18 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చివరిగా ‘జిఫైర్ 300’ పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికి మన్నికైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఈ స్పీకర్ ను తీసుకెళ్లవచ్చు.

భారతీయ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే ‘జిఫైర్ 550’ ధర రూ.8000, ‘జిఫైర్ 500’ ధర రూ.6,500, ‘జిఫైర్ 300’ ధర రూ.5000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting