‘జుమ్రీన్’ హెడ్ ఫోన్లు.., ‘కొత్త ఐడియా’.. జంట లభాలు..!!

Posted By: Staff

‘జుమ్రీన్’ హెడ్ ఫోన్లు.., ‘కొత్త ఐడియా’.. జంట లభాలు..!!


‘‘ఒకే వస్తువును రెండు విధాలుగా ఉపయోగించుకునే విధంగా ‘ప్లాన్ చేసిందా’ సంస్థ.., వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూర్చే ఈ ఉపయోగం వెనుక బ్రాండ్ వినూత్న ఆలోచన స్పష్టంగా కనబడుతుంది. ‘జుమ్రీడ్’ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘హెడ్ ఫోన్’ పరికరం ద్వారా సంగీతాన్ని రెండు విధాలుగా ఆస్వాదించవచ్చు. ఒకటి ప్రయివేటుగా, మరోకటి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో...’’

ఇది ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? ఖచ్చితంగా ఈ ప్రక్రియను సాధ్యం చేసి చూపించిందో ఫైర్ బ్రాండ్.., వినూత్న దృష్టితో, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ‘జుమ్రీడ్’ సంస్థ ఈ పరిశోధనను విజయవంతం చేసింది. ‘హై బ్రీడ్ X2’ (Hybrid X2) పేరుతో ఈ సరికొత్త ఆవిష్కరణను వినియోగదారుడికి చేరువ చేసింది.

‘హెడ్ ఫోన్ స్పీకర్ల’ ఫీచర్లు క్లుప్తంగా:

- రెండు ఆధునిక ఎక్సటర్నల్ స్పీకర్లను, హెడ్‌ఫోన్ కుడి, ఎడమ కప్ భాగాల్లో ఏర్పాటు చేశారు.

- వినియోగదారుడు కోరుకున్న విధంగా హెడ్‌సెట్ స్పీకర్లు మోడ్‌ను మార్చుకోవచ్చు.

- మల్టీ కుషిన్స్ వ్యవస్థను ఈ గ్యాడ్జెట్‌లో ప్రవేశపెట్టారు.

- హెడ్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ‘చిన్న బటన్’ సాయంతో కోరుకున్న విధంగా హెడ్‌ఫోన్ మరియు ఎక్సటర్నల్ స్పీకర్ మోడ్‌లోకి మారిపోవచ్చు.

- బ్యాటరీ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే ఈ హెడ్‌ఫోన్ పరికరం 4 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- కేవలం 60 నిమిషాల వ్యవధిలో బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.

- రెడ్, బ్లాక్, వైట్ మూడు రంగుల్లో విడులైన ఈ హెడ్‌ఫోన్లు అత్యాధునిక సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటాయి.

- చివరిగా ధర అంశానికి వస్తే ‘జుమ్రీడ్ హై బ్రీడ్ X2’ మార్కెట్లో రూ.8000లకు లభ్యమవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting