డార్క్ వెబ్‌లో 1.3 మిలియన్ భారతీయుల బ్యాంక్ కార్డు వివరాలు లీక్

|

సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబి భద్రతా పరిశోధన బృందం డార్క్ వెబ్‌లో క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వివరాల యొక్క పెద్ద డేటాబేస్ ఉన్నట్లు కనుగొన్నారు. 'ఇండియా-మిక్స్-న్యూ -01' డేటా డంప్ ట్రాక్ 1 మరియు ట్రాక్ 2 రెండు వాల్యూమ్ లలో పూర్తి వివరాలను అందజేస్తుంది. ఇందులో 1.3 మిలియన్లకు పైగా వినియోగదారుల పేమెంట్ వివరాలను కలిగి ఉన్నాయి. మొత్తం అకౌంట్ లలో 98 శాతం భారతీయ బ్యాంకులకు చెందినవి కాగా మిగిలినవి కోలుకొలంబియన్ ఫైనాన్సియల్ ఇంస్టిట్యూషన్ కు చెందినవిగా గుర్తించారు.

గ్రూప్-ఐబి
 

గ్రూప్-ఐబి షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ప్రతి కార్డు $ 100 (సుమారు రూ. 7,092) కు అమ్ముడవుతోంది. మొత్తంగా దీని ధర 130 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా రూ. 921.99 కోట్లు అన్న మాట. ఇప్పటి వరకు డార్క్ వెబ్‌లో విక్రయించాల్సిన అత్యంత విలువైన ఆర్థిక సమాచారాన్ని ఇది కలిగి ఉంది.

Gmailలో మీ ఇమెయిల్‌ను ఎలా షెడ్యూల్ చేయాలి??Gmailలో మీ ఇమెయిల్‌ను ఎలా షెడ్యూల్ చేయాలి??

పేమెంట్ కార్డు వివరాల

పేమెంట్ కార్డు వివరాలను 2019 అక్టోబర్ 28 నుండి అండర్ గ్రౌండ్ కార్డ్ షాపులైన జోకర్స్ స్టాష్‌లో విక్రయిస్తున్నారు. ఇంకా డేటాను అప్‌లోడ్ చేయనందున భారతీయ బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీల పేర్లపై ఇంకా నిర్దిష్ట సమాచారం లేదు. కానీ ఎటిఎంలు మరియు PoS (పాయింట్-ఆఫ్-సేల్) యంత్రాలలో కలిగి వున్న స్కిమ్మింగ్ పరికరాలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించవచ్చని పరిశోధకుల అభిప్రాయం.

BSNL అందిస్తున్న RS.108 ప్లాన్ ప్రయోజనాలుBSNL అందిస్తున్న RS.108 ప్లాన్ ప్రయోజనాలు

డెబిట్ / క్రెడిట్ కార్డ్ స్కిమ్మింగ్ అంటే ఏమిటి?

డెబిట్ / క్రెడిట్ కార్డ్ స్కిమ్మింగ్ అంటే ఏమిటి?

సాధారణంగా ఒక నేరస్థుడు ATM యొక్క కీప్యాడ్‌లో కీ-స్ట్రోక్ ట్రాకర్‌ను ఉంచి లేదా కొన్నిసార్లు దాని సమీపంలో ఒక చిన్న కెమెరాను ఉంచి క్రెడిట్ / డెబిట్ కార్డ్ డేటా రిట్రీవర్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేస్తాడు. వినియోగదారుడు కార్డును ATMలోకి చొప్పించిన తర్వాత అది కార్డు వెనుక భాగంలో ఉన్న అయస్కాంత గీతలోని మొత్తం సమాచారాన్ని కాపీ చేస్తుంది. అలాగే 4-అంకెల పిన్ నెంబర్ ను ఇతర డివైస్ లో రికార్డ్ చేస్తుంది.

గిన్నిస్ రికార్డు సృష్టించిన OV6948 చిన్నకెమెరా సెన్సార్‌గిన్నిస్ రికార్డు సృష్టించిన OV6948 చిన్నకెమెరా సెన్సార్‌

హ్యాకర్
 

సమాచారం పొందిన తరువాత హ్యాకర్ ఒక నకిలీ కార్డును సృష్టిస్తాడు. దాని తరువాత దానిని ఉపయోగించి సరుకులను కొనడం లేదా ఎటిఎమ్ నుండి డబ్బును విత్ డ్రా చేయడం వంటివి చేస్తాడు. ఇది PoS టెర్మినల్స్‌తో సమానంగా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నేరస్థుడు హోటల్ వెయిటర్ లేదా గ్యాస్ స్టేషన్ అటెండర్‌గా ఉంటాడు. ఇలా వారు త్వరగా డబ్బు సంపాదించడానికి వీలుగా ఉంటుంది.

AP&TS రైతుల కోసం ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీAP&TS రైతుల కోసం ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీ

ఐబి-గ్రూప్ పరిశోధన బృందం

ఐబి-గ్రూప్ పరిశోధన బృందం తన ఖాతాదారులకు మరియు నియంత్రణ అధికారులకు తెలియజేసింది. పెద్ద పెద్ద పేమెంట్ జరిగిన కార్డు యొక్క డేటా లీక్‌లు ఇంతకు ముందు జరిగాయన్నది నిజం. అయితే ఇప్పుడు లీకైన డేటాబేస్‌లు చిన్న చిన్న మరియు సాధారణ విషయాలలో వేర్వేరు సమయాల్లో అప్‌లోడ్ చేయబడిన సమాచారం కూడా లీకైనట్లు సమాచారం.

 డార్క్ మోడ్

వాస్తవానికి ఇది డార్క్ మోడ్ మార్కెట్లలో ఒకేసారి అప్‌లోడ్ చేయబడిన ఒకే ఫైల్‌లో వున్న అతిపెద్ద కార్డ్ డేటాబేస్. ఈ ప్రత్యేక కేసు గురించి ఆసక్తికరమైన విషయం ఉంది. కార్డ్ ఉపయోగించి షాపులో లేదా డార్క్‌నెట్‌లోని ఫోరమ్‌లలో కూడా కొనుగోలు చేసిన మొత్తం డేటాబేస్ సెకరించినట్లు సమాచారం.

గ్రూప్-ఐబి సిఇఒ ఇలియా సచ్కోవ్

గత 12 నెలల్లో ఇది భారతీయ బ్యాంకులకు సంబంధించిన కార్డ్ డంప్‌ల పెద్ద అమ్మకం. గ్రూప్-ఐబి యొక్క థ్రెట్ ఇంటెలిజెన్స్ కస్టమర్లకు ఈ డేటాబేస్ అమ్మకం గురించి ఇప్పటికే తెలియజేయబడింది. ఈ సమాచారాన్ని బ్యాంకు అధికారులతో కూడా పంచుకున్నాము అని గ్రూప్-ఐబి సిఇఒ ఇలియా సచ్కోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ATM మరియు PoS మెషీన్లలో స్కిమ్మర్లను ఎలా గుర్తించాలి:

ATM మరియు PoS మెషీన్లలో స్కిమ్మర్లను ఎలా గుర్తించాలి:

1) ATM యొక్క కీప్యాడ్‌లో మరియు కార్డ్ స్లాట్‌లో వదులుగా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏదైనా జతచేశారేమో ఒక సారి చూడండి. ఒకవేల మీరు దానిని వేరు చేయగలిగినట్లు భావిస్తే దాన్ని లాగివేయవచు.

2) అలాగే ATM కీప్యాడ్ మరియు కార్డ్ స్లాట్ చుట్టూ జిగురు వంటిది లేదా టేప్ కు సంబందించిన ఏవైనా గుర్తులు ఉన్నాయేమో చూడండి. వాటిని కనుగొనడానికి మీ యొక్క వేళ్లను ఉపయోగించవచ్చు.

3) ఇంకా ATM యొక్క భద్రత విషయంలో మీకు అనుమానం ఉంటే కనుక పిన్ నంబర్‌ను టైప్ చేసేటప్పుడు కీప్యాడ్‌ను చేతితో కప్పి ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది నేరస్థులు నంబర్‌ను తెలుసుకోవడానికి మరియు రికార్డ్ చేయడానికి కెమెరాలను ఇన్‌స్టాల్ చేసి ఉంటారు.

4) కార్డు ATM మెషిన్ లోకి వెళ్ళే బేస్ వద్ద వదులుగా ఉన్న భాగాలను కాస్త జాగ్రత్తగా తనిఖీ చేయండి చాలా మంచిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
1.3 Million Indian Payment Card info up for Sale on Dark Web

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X