ఆఫర్ల పేరుతో భారీ మోసాలు అన్నీ ఫేక్ వస్తువులే !
పండగలను పురస్కరించుకు ఈ కామర్స్ దిగ్గజాలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
పండగలను పురస్కరించుకు ఈ కామర్స్ దిగ్గజాలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నారనే నిజాలు ఇప్పుడు యూజర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆన్ లైన్ అమ్మకాల్లో దాదాపు సగం ఉత్పత్తులు ఫేక్ వే నని ఓ సర్వే తేల్చి చెప్పింది. ఈ కామర్స్ దిగ్గజాలైన పేటీఎమ్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఫ్లాట్ ఫాం మీద దాదాపు 20 నుంచి 22 శాతం వరకు ఫేక్ ఉత్పత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. గత ఆరు నెలల కాలంలో చాలామంది కస్టమర్లు ఈ ఫేక్ ఉత్పత్తుల భారీన పడ్డారని ఈ సర్వే తెలిపింది.

దాదాపు 30 వేల ఉత్పత్తుల మీద...
దాదాపు 30 వేల ఉత్పత్తుల మీద గ్రామాల్లో , పట్టణాల్లో, నగరాల్లో సర్వే నిర్వహించారు. రోజువారి జీవితంలో అవసరమైన అనేక రకాలైన ఉత్పత్తులు నకిలీవేనని వాటిని యూజర్లకు అంటగడుతున్నారని ఈ కోవలో దాదాపు 30 వేల ఉత్పత్తులు ఉన్నాయని సర్వేలో నిజాలు బయటకు వచ్చాయి.

నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీదనే...
నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీదనే అమ్మకానికి వస్తున్నాయని తక్కువ ధరకు వస్తుండటంతో వినియోగదారుడు అది నకిలీదో కాదో తెలుసుకోకుండానే దాన్ని కొనుగోలు చేస్తున్నాడని ఆ తర్వాత లబోదిబో మంటున్నానడని సర్వే తెలిపింది.

స్నాప్ డీల్ లో 37 శాతం, ఫ్లిప్ కార్ట్ లో 22 శాతం...
ఈ నకిలీ ఉత్పత్తులు ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ లో 37 శాతం, ఫ్లిప్ కార్ట్ లో 22 శాతం, పేటీఎమ్ లో 21 శాతం, అమెజాన్ లో 20 శాతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కువ శాతం కాస్మోటిక్స్, ఇంటి అవసరాలకు వినియోగించే వస్తువులు, ఆట వస్తువులు, బ్యాగులు ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది.

ఆలీబాబా, అమెజాన్ కంపెనీలకు ఇప్పుడు ఈ ఫేక్ ఉత్పత్తులు....
ఆలీబాబా, అమెజాన్ కంపెనీలకు ఇప్పుడు ఈ ఫేక్ ఉత్పత్తులు పెద్ద తలనొప్పిగా మారాయి. వీటి ద్వారా ఈ దిగ్గజాలకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వారు గగ్గోలు పెడుతున్నారు. కాగా ఈ ఫేక్ వస్తువులపై ఈ కంపెనీలు వార్నింగ్ కూడా ఇచ్చాయి.

అమెరికాలో ఎక్కువగా ఈ నకిలీ మోసాలు జరుగుతున్నాయని తెలుస్తోంది....
అమెరికాలో ఎక్కువగా ఈ నకిలీ మోసాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఉత్పత్తులను అమ్మే మూడో పార్టీలకు ఈ కామర్స్ దిగ్గజాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫేక్ వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.


Click it and Unblock the Notifications