ఫేస్‌బుక్ సంచలనం.. ఒక్కరోజులో 100 కోట్ల మంది

Posted By:

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా, సోమవారం ఒక్కరోజే ఈ వేదికను 100 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌‍బర్గ్ స్పందిస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించాం. ఒకే ఒక్కరోజులో వంద కోట్ల మంది ఫేస్‌బుక్‌ను ఉఫయోగించుకున్నారు.

Read More : అంతరిక్షంలో విస్కీ తాగే దమ్ముందా...?

తొలిసారిగా ఇది జరిగింది. సోమవారం నాడ భూమీదున్న ప్రతి ఏడుగురిలో ఒకరు మిత్రులు, బంధువులతో ఫేస్‌బుక్ ద్వారా అనుసంధనమయ్యారని అన్నారు. జూన్ 2015 లెక్కల ప్రకారం ఫేస్‌బుక్‌లో నెలకు ఒక్కసారైనా లాగిన్ అవుతున్న వారి సంఖ్య 1.49 బలియన్లుగా ఉంది. డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 968 మిలియన్లుగా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

మీ అప్‌కమింగ్ హాలీడే ట్రిప్‌లకు సంబంధించిన వివరాలను మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయకండి.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

గుర్తుతెలియని వ్యక్తితో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్సులో మీ వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయకండి.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

గుర్తు తెలియని వ్యక్తుల friend requestలను యాక్సప్ట్ చేయకండి.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

పబ్లిక్ కంప్యూటర్‌ల నుంచి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లలోకి లాగిన్ కావొద్దు

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

సాధ్యమైనంత వరకు keep me logged in పై టిక్ చేయకండి. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

ఈమెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 ముఖ్యమైన ఫేస్‌బుక్ టిప్స్

మొబైల్ నెంబర్ అడ్రస్ వంటి వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వినియోగిస్తోన్న మీ పీసీ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
1 billion people used Facebbok on a single day. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot