రెండు గంటల సినిమా... కేవలం 30 సెకన్లలో డౌన్‌లోడ్!

Posted By: Super

రెండు గంటల సినిమా... కేవలం 30 సెకన్లలో డౌన్‌లోడ్!

 

రిటైల్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లు త్వరలో అల్ట్రా-హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుకోనున్నారు. సెకనుకు 1గిగాబైట్ డౌన్‌లోడింగ్ సామర్ధ్యం కలిగిన ఈ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ 2013 మధ్య నాటికి అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో ఈ ప్లాన్ అందుబాటులోకి రానుందని రేడియస్ ఇన్‌ఫ్రా‌టెల్ తెలిపింది. ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తే రెండు గంటల నిడివి కలిగిన హైడెఫినిషన్ సినిమాను కేవలం 30 సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రేడియస్ ఇన్‌ఫ్రా‌టెల్ సీఈవో రాజ్‌నిష్ వాహి తెలిపారు. గృహవినియోగానికి సైతం ఈ సరికొత్త 1జీబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ప్లాన్ అందుబాటులోకి రానుందని ఆయన  పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్‌బ్యాండ్ స్పీడ్‌లతో రెండు గంటల నిడివి కలిగిన హైడెఫినిషన్ సినిమాను డౌన్‌లోడ్ చేయలంటే కనీసం గంట సమయం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా డీఎల్ఎఫ్, ఎమ్మార్ ఎంజీఎఫ్, వోమాక్సీ, పారామంట్, ప్రటీక్ వంటి సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్నట్లు ఇన్‌ఫ్రా‌టెల్ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం 100మెగా బిట్ పర్ సెకండ్ ప్లాన్‌లను ప్రముఖ టెలికం ఆపరేటర్‌లు భారతి ఎయిర్ టెల్, టాటా టెలీ‌సర్వీస్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్ ధర అంచనా రూ.5,000 (నెలకు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot