24 గంటల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మారు!

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ మురో రికార్డ్ నెలకొల్పింది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన 'Redmi 4A' స్మార్ట్‌ఫోన్ అక్కడి మార్కెట్లో అమ్మకాల రికార్డును నెలకొల్పింది. చైనాలో శుక్రవారం నిర్వహించిన సింగిల్స్ డే సేల్‌లో భాగంగా ఒక్కరోజులోనే 10 లక్షల రెడ్మీ 4ఏ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు షియోమీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read More : ఫోన్ రూటింగ్.. పెద్ద రిస్క్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1270కోట్ల విలువ..

వీటి విలువ దాదాపుగా రూ.1270కోట్లుగా ఉంటుందని షియోమీ గ్లోబల్ ఉపాధ్యక్షుడు హుగో బర్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.

అందుబాటులో అనేక వస్తువులు..

ఈ సంచలనాత్మక ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌లో భాగంగా ఎంఐ రౌటర్ 3, ఎంఐ నోట్‌బుక్, ఎంఐ ప్యాడ్, ఎంఐ బ్యాండ్, ఎంఐ బ్యాండ్ 2, ఎంఐ డ్రోన్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్, నైన్ బోట్ మినీ, ఎంఐ లగేజ్ వంటి ఉత్పత్తులను షియోమీ అందుబాటులో ఉంచింది.

Redmi 4A స్పెసిఫికేషన్స్

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1080 పిక్సల్స్, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సింగిల్స్ డే...

ప్రతి ఏటా నవంబర్ 11న సింగిల్స్ డే పేరుతో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఆలీబాబా ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించటం జరుగుతోంది. ఈ ఏడాది నిర్వహించిన సేల్‌లో భాగంగా, అమ్మకాలు ప్రారంభమైన తొలి గంటలోనే సుమారు రూ.33,515 కోట్ల విలువ
చేసే లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.

‘యాంటీ వాలెంటైన్స్ డే'

నవంబర్ 11న చైనాలో జరుపుకునే ‘సింగిల్స్ డే'ను ‘యాంటీ వాలెంటైన్స్ డే'గా పిలుస్తారు. ప్రేమికుల రోజును జరపుకోవడాన్ని నిరసిస్తూ 2009 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 11న ఆలీబాబా ఈ భారీ స్థాయి డిస్కౌంట్‌లను ప్రకిటిస్తోంది.

గతంలో చైనాకు మాత్రమే పరిమితం

గతంలో చైనాకు మాత్రమే పరిమితమైన ఈ ‘సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజా ఆఫర్‌ను ఆలీబాబా ఈసారి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసకువచ్చింది. దీంతో ప్రపంచదేశాల నుంచి ఆన్‌లైన్ షాపర్లు డిస్కౌంట్ ధరల పై వస్తువులను దక్కించేకునేందుకు ఎగబడ్డారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
1 Million Xiaomi Redmi 4A Units Sold in 24 Hours. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot