సెకనుకి 10,000 ట్వీట్స్, ట్విట్టర్ సర్వర్ డౌన్

Posted By: Super

సెకనుకి 10,000 ట్వీట్స్, ట్విట్టర్ సర్వర్ డౌన్

ఐఫోన్ పితామహుడు యాపిల్ సహావ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి అందరికి తెలిసిందే. స్టీవ్ జాబ్స్ 1976లో సిలికాన్ వ్యాలీలోని ఒక గ్యారేజిలో తనతో పాటు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన ఒక స్నేహితునితో కలిసి యాపిల్ ప్రారంభించారు. ఆయన వయస్సు 56 ఏళ్లు. చాలా కాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఆయన తుది శ్వాస విడిచారు. తాను ఉదర సబంధమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జాబ్స్ 2004లో ప్రకటించారు. దాని వల్లనే ఆయన ఈ ఏడాది జనవరిలో మెడికల్ లీవ్ పెట్టారు. ఆ తర్వాత ఆగస్టులో సిఇవో పదవి నుంచి వైదొలగడం, ఆ తర్వాత సిఈవో భాద్యతలను టిమ్ కుక్‌కు అప్పగించడం మనం చూశాం.

స్టీవ్ జాబ్స్ చనిపోయాడన్న వార్తను మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయిన ట్విట్టర్‌లో సెకనుకి 10,000 ట్వీట్స్ పంపడం జరిగిందని ట్విట్టర్ బ్లాగులో తెలిపారు. స్టీవ్ జాబ్స్ చనిపోయిన రోజు న్యూయార్క్, శాన్ ప్రాన్సికో సిటీలలో కేవలం ఆయన ఒక్కడే పెద్ద టాఫిక్‌గా మాట్లాడుకొవడం జరిగింది. కేవలం పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా స్టీవ్ జాబ్స్ ఓ రోల్ మోడల్‌గా నిలచాడని, కొన్ని ఇంగ్లీషు ఛానల్స్ ప్రకటించడం గురువారం(అక్టోబర్ 6) మనం చూశాం.

స్టీవ్ జాబ్స్ చనిపోయిన ఒక్క గంటలో కొన్ని కొట్ల కొద్ది ట్వీట్స్ చేయడంతో ట్విట్టర్ వెబ్ సైట్ ఒక్కసారిగా డౌన్ అవడం జరిగిందని చాలా మంది వారియొక్క ట్వీట్స్ ద్వారా తర్వాత తెలపడం జరిగింది. ఆ గంట సమయంలో వచ్చిన ఇష్యూలకు పరిష్కారం చేయడానికి ట్విట్టర్ ఇంజనీర్స్ బృందం కూడా చాలా సేపు కష్టపడడం జరిగిందని ట్విట్టర్ బ్లాగులో ట్వీట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి ఇబ్బంది మరలా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot