Jio ఎందుకంత బెస్ట్..?

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు మరికొద్ది రోజుల్లో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమ్ పేరుతో సరికొత్త పథకాన్ని జియో తెలపైకి తీసుకువచ్చింది. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 6 నెలల పాటు తన సర్వీసులను ఉచితంగా ఆఫర్ చేస్తూ రిలయన్స్ జియో తన కస్టమర్ బేస్‌‌ను 10 కోట్లకు పెంచుకుంది. కోట్ల మంది భారతీయలు జియో నెట్‌వర్క్‌కు ఇంతలా కనెక్ట్ అవటానికి కారణాలు చాలానే ఉన్నాయి.

రూ.999కే నోకియా ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్

రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్ కావటం. ఈ సౌలభ్యతతో జియో సిమ్ యూజర్లు నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలను ఫేస్ చేసే అవకాశముండదు.

VoLTE అంటే..?

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

వాయిస్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ ఉచితం

రిలయన్స్ జియోలో వాయిస్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ పూర్తిగా ఉచితం. అయితే TRAI నిబంధనలు ప్రకారం రోజుకు మీరు 100 ఎస్ఎంఎస్‌లు మాత్రమే పంపుకోవాలి. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు.

రోమంగ్ ఛార్జీలు ఉండవు

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఎటువంటి రోమంగ్ ఛార్జీలు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు.

ఉచిత వైఫై..

రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్స్‌లో భాగంగా వై-ఫై డేటాను కూడా యూజర్లకు అందిస్తోంది. ఈ డేటాను ఉపయోగించుకుని పబ్లిక్ ప్రాంతాల్లో రిలయన్స్ ఏర్పాటు చేసే జియో వై-ఫై హాట్ స్పాట్‌ల వద్ద ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

జియో యాప్ సూట్‌ ఉచితంగా

జియో యూజర్లు రిలయన్స్ జియో యాప్ సూట్‌ను డిసెంబర్ 31, 2017 వరకు ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. ఈ సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.

రూ.1000కే LYF ఫోన్..

జియో తన 4G సేవలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో LYF బ్రాండ్ పేరిట చౌక ధర 4G ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ల ప్రారంభ ధర రూ.2,999. జియో సిమ్ యాక్టివేషన్ తో ఈ ఫోన్ లు లభిస్తున్నాయి. త్వరలోనే రూ.1000 బడ్జెట్ లోనూ జియో ఫోన్ ను రాబోతున్నట్లు సమాచారం.

సెప్టంబర్, 2016 నుంచి..

సెప్టంబర్, 2016 నుంచి రిలయన్స్ జియో సేవులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. తొలత వెల్‌కమ్ ఆఫర్ పేరుతో జియో ఉచిత సేవలను ఆఫర్ చేయటం జరిగింది. వెల్‌కమ్ ఆఫర్ ముగిసిన తరువాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ మార్చి 31, 2017తో ముగియనుంది.

Jio Prime పేరుతో..

మార్చి 31, 2017తో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగస్తున్నప్పటికి, దేశవ్యాప్తంగా ఉన్న తన 10 కోట్ల మంది చందాదారులకు మేలు చేకూర్చే క్రమంలో Jio Prime పేరుతో సరికొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి Jio Prime మెంబర్‌షిప్ ప్లాన్‌ను పొందవల్సి ఉంటుంది.

మార్చి 31 లోపు సభ్యత్వం తీసుకోవాలి..?

జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు జియో వాయిస్ కాల్స్ ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు వర్తించవు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ 12 నెలల మెంబర్‌షిప్ పిరియడ్‌లో భాగంగా నెలకు రూ.303 చెల్లించటం ద్వారా రోజుకు 1జీబి హై-స్పీడ్ 4జీ డేటాను పొందటంతో పాటు జియో మీడియా సర్వీసులను ఉచితంగా ఆస్వాదించవచ్చు. Jio Prime మెంబర్‌షిప్‌ను పొందాలనుకునే జియో యూజర్లు మార్చి 31 లోపు జియో అఫీషియల్ వెబ్‌సైట్ లేదా సమీపంలోని జియో స్టోర్‌లలోకి వెళ్లి రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Advantages With of Reliance Jio. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot