ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

Posted By:

మొబైల్ ఫోన్ అనుభవాలను రోజురోజుకు మార్చేస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ రకరకాల ఆపరేటింగ్ సిస్టంలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కప్ కేక్‌తో మొదలైన ఆండ్రాయిడ్ వోఎస్‌ల ప్రస్థానం అంచెలంచెలుగా ఎగబాకుతూ డోనట్.. ఇక్లెయర్.. ఫ్రోయో.. జింజర్ బ్రెడ్.. హనీకూంబ్.. ఇస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్ పేర్లతో విస్తరించింది.

మైక్రోసాఫ్ట్ విండోస్.. ఆపిల్ ఐవోఎస్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలకు ధీటైన పోటినిస్లూ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ ఆండ్రాయిడ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ అంతర్జాతీయ బ్రాండ్‌‌లు మొదలుకుని మైక్రమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగానే డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఆండ్రాయిడ్‍‌ను గూగుల్ స్థాపించ లేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొత్తాన్ని గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

గూగుల్ తన మొదటి ఆపరేటింగ్ సిస్టంను 2007లో ఆవిష్కరించింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంను కెమెరాల కోసం డెవలప్ చేసారు. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లకు ఓఎస్ కీలకమని గుర్తించిన గూగుల్ మరిన్ని ఫీచర్ల పై పరిశోధనలు చేపట్టింది.

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆరంభంలో కేవలం డిజిటల్ కెమెరాల కోసమే అభివృద్థి చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఉపయోగించింది.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఈ స్మార్ట్‌ఫోన్ 2008 అక్టోబర్‌లో విడుదలైంది. డివైస్‌లో లైనెక్స్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఉపయోగించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 1.0 నుంచి 1.6 వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా 190 పై చిలుకు దేశాల్లో వినియోగించుకుంటున్నారు.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

కప్‌ కేక్ (ఆండ్రాయిడ్ 1.5)

డూనట్ (ఆండ్రాయిడ్ 1.6)

ఎక్లెయిర్ (ఆండ్రాయిడ్ 2.0, ఆండ్రాయిడ్ 2.0 )

ఫ్రోయో (ఆండ్రాయిడ్ 2.2)

జింజర్‌బ్రెడ్ (ఆండ్రాయిడ్ 3.0, ఆండ్రాయిడ్ 3.1, ఆండ్రాయిడ్ 3.2)

ఐస్‌క్రీమ్ శాండ్విచ్ (ఆండ్రాయిడ్ 4.0)

జెల్లీబీన్ (ఆండ్రాయిడ్ 4.1, ఆండ్రాయిడ్ 4.2, ఆండ్రాయిడ్ 4.3),

కిట్‌క్యాట్ (ఆండ్రాయిడ్ 4.4),

లాలీపాప్ (ఆండ్రాయిడ్ 5.0, ఆండ్రాయిడ్ 5.1)

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఏ ఫర్ ఆస్ట్రో (1.0)

బీ ఫర్ బెండర్ (1.1)
సీ ఫర్ కప్ కేక్ (1.5)
డీ ఫర్ డూనట్ (1.6)
ఇ ఫర్ ఎక్లెయర్ (2.0)
ఎఫ్ ఫర్ ఫ్రోయో (2.2ఎక్స్)
జీ ఫర్ జింజర్‌బ్రెడ్ (2.3ఎక్స్)
హెచ్ ఫర్ హనీ‌కూంబ్ (3.ఎక్స్)
ఐ ఫర్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ (4.0ఎక్స్)
జె ఫర్ జెల్లీబీన్ (4.3)
కే ఫర్ కిట్‌క్యాట్ (4.4)
ఎల్ ఫర్ లాలీపాప్ (5.0)

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఓపెన్ మార్కెట్ ప్లేస్

ఓపెన్ హ్యాండ్సెట్ అలియన్స్ (ఓహెచ్ఏ)లో గూగుల్‌కు సభ్యత్వం ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సోర్స్ కోడ్‌ను ఎవరైనా అభివృద్థి పరచవచ్చు.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఆండ్రాయిడ్ ఉచితం

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లైసెన్స్ ను ఏ విధమైన చెల్లింపులు లేకుండా ఆఫర్ చేస్తోంది.

 

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ఆండ్రాయిడ్ ద్వారా లాభాల బాటలో గూగుల్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను విశ్వ వ్యాప్తం చేయటంతో గూగుల్ మొబైల్ అడ్వరటైజింగ్ విభాగంలో సింహ భాగాన్ని దక్కించుకుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Amazing Facts You Didnt Know About Android. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot