యాపిల్ కొత్త ఐఫోన్‌లలో మిస్ అయిన 10 ఆండ్రాయిడ్ ఫీచర్లు

ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన గూగుల్ ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్‌లు తాజాగా కొత్త అప్‌డేట్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి.

యాపిల్ కొత్త ఐఫోన్‌లలో మిస్ అయిన 10  ఆండ్రాయిడ్ ఫీచర్లు

Read More : రిలయన్స్ జియో సిమ్‌లను సపోర్ట్ చేస్తున్న 30 బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌ల వివరాలు..

యాపిల్ iOS 10 పేరుతో సరికొత్త ఓఎస్ అప్‌గ్రేడ్‌ను గతవారమే మార్కెట్లో లాంచ్ చేయగా, ఆండ్రాయిడ్ తన లేటెస్ట్ వర్షన్ Nougat ఓఎస్‌ను గడిచిన నెలలనో మార్కెట్లో లాంచ్ చేసేంది. ఈ రెండు కొత్త ఓఎస్‌లు సరికొత్త ఫీచర్లతో యజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆండ్రాయిడ్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే యాపిల్ iOS 10లో కొన్ని ఫీచర్లు మిస్సయ్యాయి. వాటి వివరాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

split-screen

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌తో పాటు యాపిల్ ఐఓఎస్ 10 ప్లాట్‌ఫామ్‌లు split-screen మల్టీటాస్కింగ్ ఫీచర్‌ను అందిస్తున్నప్పటికి వీటి మధ్య భారీగానే వ్యత్యాసముంది. ఐఓఎస్ 10 అందిస్తోన్న split-screen సదుపాయం ఐప్యాడ్‌లలో మాత్రమే వర్క్ అవుతోంది. ఐఫోన్‌లలో వర్క్ అవటం లేదు. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ నౌగట్‌ ఆఫర్ చేసే split-screen ఫీచర్ చిన్న స్ర్కీన్, పెద్ద స్ర్కీన్ అనే తేడా లేకుండా అన్ని డివైస్‌లకు అందుబాటులో ఉంది.

క్విక్ టాగిల్స్‌ విషయంలో..

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో టార్చ్, వై-ఫై, డేటా, లోకేషన్, బ్లుటూత్ వంటి నిఫ్టీ ఫీచర్లను వేగవంతంగా యాక్సెస్ చేసుకునే అవకాశముంటుంది. నోటిఫికేషన్ ప్యానల్‌ను క్రిందకు స్వైప్ చేయటం ద్వారా క్విక్ టాగిల్స్‌ను మనం పొందగలుగుతాం.

ఇదే సమయంలో ఐఓఎస్ 10 విషయానికి వచ్చేసరికి కంట్రోల్ సెంటర్‌ను యాక్సెస్ చేసుకునేందుకు బోటమ్ నుంచి పైకి స్వైప్ చేయవల్సి ఉంటుంది.

యాప్స్ మధ్య వేగంగా స్విచ్ అవ్వాలంటే

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రెండు యాప్స్ మధ్య వేగంగా స్విచ్ అయ్యే అవకాశముంటుంది. మల్టీ విండో బటన్ పై డబల్ ట్యాప్ ఇవ్వటం ద్వారా ఇంతకు ముందు ఉపయోగించిన యాప్స్ మన కళ్లముందు కనిపిస్తాయి. వీటిలో కావల్సిన యాప్‌కు స్విచ్ కావొచ్చు. ఐఓఎస్ 10లో ఇంతకు ముందు ఓపెన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ జాబితాను పొందాలంటే Home buttonపై లాంగ్ ప్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది.

Doze మోడ్

గూగుల్ అందిస్తోన్న మరో అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫీచర్ Doze. తొలత ఈ ఫీచర్‌ను గూగుల్, ఆండ్రాయిడ్ Marshmallow ద్వారా పరిచయం చేసింది. Doze మోడ్ అనేది ఫోన్ బ్యాటరీ లైఫ్ ను మరింతగా ఆదా చేస్తుంది. ఐఓఎస్ 10లో ఈ తరహా ఫీచర్ లోపించింది.

Data Saver

Doze మోడ్ తరహాలోనే 'Data Saver' పేరుతో సరికొత్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ నౌగట్ ఆఫర్ చేస్తోంది. ఈ డేటా సేవర్ ఫీచర్ ద్వారా యూజర్ యాప్స్ పై కంట్రోల్ తీసుకుని ఇంటర్నెట్ డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఐఓఎస్ 10లో

ఈ తరహా ఫీచర్ లోపించింది.

 

Daydream VR

గూగుల్ తన ఆండ్రాయిడ్ లేటెస్ట్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో Daydream VR పేరుతో సరికొత్త రియాల్టీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. ఈ కొత్త వీఆర్ మోడ్ వర్చువల్ రియాల్టీ అనుభూతులను మరింతగా మెరుగుపరుస్తుంది.

కొత్త సెట్టింగ్స్ పేజీ

గూగుల్ తన ఆండ్రాయిడ్ లేటెస్ట్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో కొత్త సెట్టింగ్స్ పేజీని అందిస్తోంది. ఈ పేజీలో యూజర్ సజెషన్స్ పరిగణంలోకి తీసుకోబడతాయి.

మల్టిఫుల్ ప్రొఫైల్స్‌

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో సపరేట్ స్టోరేజ్ డ్రైవ్స్ ఇంకా యాప్స్‌తో మల్టిఫుల్ ప్రొఫైల్స్‌ను సెట్ చేసుకోవచ్చు.

Instant apps

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో ఆఫర్ చేస్తున్న Instant apps సదుపాయం ద్వారా యూజర్ వేగవంతంగా యాప్స్ ను శోధించే అవకాశముంటుంది. ఐఓఎస్ 10లో ఈ తరహా సదుపాయం అందుబాటులో లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Android Nougat features missing in latest Apple iPhones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot