సంచలనం రేపుతోన్న సామ్‌సంగ్ వాచ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్, తన గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి మూడు కొత్త వేరియంట్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త యాప్స్ ఇంకా డయల్ ఫేసేస్‌తో కనువిందు చేస్తున్నఈ వేరబుల్ డివైస్‌లను అన్ని సామ్‌సంగ్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచారు. వైట్ వేరియంట్ ధర రూ.24,300 కాగా, క్లాసిక్ గోల్డ్ ఇంకా ప్లాటినమ్ వేరియంట్ ధర రూ.34,900గా ఉంది.

 సంచలనం రేపుతోన్న సామ్‌సంగ్ వాచ్

అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్ ఇక్కడే

ఉబెర్ క్యాబ్ సర్వీసెస్, గుడ్‌నెట్ స్లీప్ ట్రాకింగ్, మై నోట్స్, Xenozu (యూట్యూబ్ బ్రౌజింగ్) వంటి యాప్‌లతో పాటు ఇన్‌బుల్ట్ గేమ్స్, హెల్త్ , ఫిట్నెస్, కనెక్టువిటీ ఇంకా లైఫ్‌స్టైల్ సొల్యూషన్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని ఈ వాచ్‌లో సామ్‌సంగ్ పొందుపరిచింది. గేమింగ్ ప్రియులు ఈ వాచ్ ద్వారా సరికొత్త గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాసిస్‌తో వస్తోన్న ఈ డివైస్ స్లిమ్ లుక్‌తో మణికట్లుకు ఇట్టే సూట్ అవుతుంది.

 సంచలనం రేపుతోన్న సామ్‌సంగ్ వాచ్

Read More : ఇక డ్రైవింగ్ లైసెన్స్‌తో పనిలేదు.. ఫోన్ ఉంటే చాలు!

వాచ్ స్పెక్స్:

1.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (302 పిక్సల్ డెన్సిటీ), సిరామిక్ కోటెడ్ గొరిల్లా గ్లాస్, 1గిగాహెర్ట్జ్ డ్యయల్ కోర్ ఎక్సినోస్ 3250 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, టైజెన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ది చేసిన ప్రత్యేకమైన వేరబుల్ ప్లాట్‌ఫామ్ పై వాచ్ రన్ అవుతుంది. 250 ఎమ్ఏహెచ్ Li-ion బ్యాటరీని వాచ్‌లో పొందుపరిచారు.

 సంచలనం రేపుతోన్న సామ్‌సంగ్ వాచ్

Read More : విజువల్ మాయ : కనికట్టు చేసి కోట్లు కొల్లగొట్టారు

తాజాగా తోడైన మూడు వేరియంట్‌లతో కలుపుకుని మొత్తం 5 వేరియంట్‌లలో గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్ లభ్యమవుతోంది. వాటి వివరాలు.. గేర్ ఎస్2 క్లాసిక్ బ్లాక్, గేర్ ఎస్2 రోజ్ గోల్డ్, గేర్ ఎస్2 క్లాసిక్ ప్లాటినమ్, గేర్ ఎస్2 బ్లాక్, గేర్ ఎస్2 వైట్. సామ్‌సంగ్ గేర్ ఎస్2 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి 10 స్టన్నింగ్ ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో వస్తుంది.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

సర్క్యులర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన రొటేటింగ్ బీజిల్

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఉబెర్ క్యాబ్ ను బుక్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆ పై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

వాచ్‌లోని ఎస్ హెల్త్ యాప్ ద్వారా రోజు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

ఫోన్‌కు వచ్చిన నోటిఫికేషన్‌లను వాచ్‌లో చూసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

క్యాలెండర్ నోటిఫికేషన్స్‌తో పాటు న్యూస్ అప్‌డేట్‌‍లను గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్ ద్వారా పొందవచ్చు.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

స్మార్ట్‌ఫోన్‌ను ముట్టుకోకుండా ఫోన్‌లోని అన్ని ఫీచర్లను వాచ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకతలు

వాచ్‌లో 300 పాటల వరకు స్టోర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Beautiful Pictures of Samsung Gear S2 Classic 18K Rose Gold Variant, It's Now Available in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot