Android Q వచ్చేసింది, బెస్ట్ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి

టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టంను యూజర్లకు అందిస్తూ వెళుతోంది. మొన్నటికి మొన్న ఆండ్రాయడ్ పై యూజర్లను కనువిందుచేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ Qని మార్కెట్లోకి త

|

టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టంను యూజర్లకు అందిస్తూ వెళుతోంది. మొన్నటికి మొన్న ఆండ్రాయడ్ పై యూజర్లను కనువిందుచేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ Qని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ 10 అంటటూ వచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టం చివరకు ఆండ్రాయిడ్ క్యూగా మార్కెట్లోకి విడుదలయింది. ఆండ్రాయిడ్ 9 దాటి మనం ఆండ్రాయిడ్ క్యూకి వచ్చేశాం. ఆండ్రాయిడ్ ప్రయాణంలో గూగుల్ వేసిన 10వ అడుగు ఇది.

Android Q వచ్చేసింది, బెస్ట్ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి

గూగుల్ ఆండ్రాయిడ్ క్యూలో ఆకట్టుకునే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.మరి ఇందులో దాగిన స్పెషల్ ఫీచర్లు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయనే దాని మీద కొన్ని వివరాలను ఈ శీర్షికలో భాగంగా అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

డార్క్ మోడ్

డార్క్ మోడ్

ఇప్పటికే చాలా మొబైల్‌ సంస్థలు డార్క్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌, రీడర్‌ మోడ్‌ అంటూ కొన్ని ఫీచర్లను యాప్‌ల వారీగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్‌ కూడా ఈ తరహాలో ఆలోచిస్తోంది. అదే డార్క్‌ స్క్రీన్‌. అయితే దీని ద్వారా ఫోన్‌ మొత్తాన్ని నైట్‌ మోడ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు. కంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

పాత వర్షన్

పాత వర్షన్

ఒక వేళ అప్‌డేట్‌ నచ్చకపోతే తిరిగి పాత వెర్షన్‌లోకి వెళ్లిపోయే విధంగా ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో కొత్త ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. దీని వల్ల మీకు నచ్చినప్పుడు మాత్రమే కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పొరపాటున ఆటో అప్‌డేట్‌ అయిపోయినా మళ్లీ వెనక్కి రావొచ్చు.

యాప్ పర్మిషన్

యాప్ పర్మిషన్

మనం వాడుతున్న సేపే పర్మిషన్స్ పనిచేసే విధంగా ఆండ్రాయిడ్ 10 వస్తోంది. మనం వాడకం అయిపోగానే వాటంతట అవే క్లోజ్ అవుతాయి. మళ్లీ కొత్తగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.మీ ఫోన్‌లో ఉన్న వీడియో ప్లే అయ్యేప్పుడు లైవ్ క్యాప్షన్ ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది. యూట్యూబ్ వీడియో అయినా, వీడియోకాల్, పాడ్ క్యాస్ట్, వాయిస్ మెసేజ్... అయినా లైవ్ క్యాప్షన్ ఫీచర్ పనిచేస్తుంది.

మొబైల్ నుండి కంప్యూటర్

మొబైల్ నుండి కంప్యూటర్

మొబైల్‌లో ఆడే ఆటలు, వాడే యాప్‌లు కంప్యూటర్‌ తెరపై కనిపిస్తే బాగుంటుంది కదా. ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో ఇలాంటి ఆప్షనే అందుబాటులో ఉంది. డేటా కేబుల్‌తో కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి ఫోన్‌లో డెస్క్‌టాప్‌ మోడ్‌ ఆప్షన్‌ ఆన్ చేస్తే చాలు.. ఫోన్‌లోని ప్రతి ఆప్షన్‌... కంప్యూటర్‌పై కనబడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను శాంసంగ్‌ తీసుకొచ్చింది.

స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్

స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్

గూగుల్ మెషీన్ లెర్నింగ్ ఫీచర్స్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్ ఫీచర్ కూడా అలాంటిదే. ఇకపై మీ మెసేజింగ్ యాప్స్‌లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్ ఫీచర్స్ వాడుకోవచ్చు. దీని ద్వారా మీకు వచ్చిన మెసేజ్ కంటెంట్‌ను అర్థం చేసుకొని అందుకు కావాల్సిన రిప్లైని సజెస్ట్ చేస్తుంది గూగుల్. ఉదాహరణకు మీకు మెసేజ్‌లో ఎవరైనా అడ్రస్ పంపిస్తే... డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్‌లో మీకు ఆ అడ్రస్ కనిపిస్తుంది.

ఆకారాలు, అక్షరాలు

ఆకారాలు, అక్షరాలు

ఆండ్రాయిడ్‌ ‘క్యూ'లో చాలా రకాల ఐకాన్‌లు ఉంటాయట..! వాటి ద్వారా మనకు నచ్చినట్లుగా ఐకాన్లు, అక్షరాలను మార్చుకోవచ్చు. కొత్త ఆండ్రాయిడ్‌లో రౌండెడ్‌ రెక్టాంగిల్‌, స్క్వేర్‌, సర్కిల్‌, టియర్‌ డ్రాప్‌ లాంటి ఐకాన్లు ఉంటాయి. వాటిలో నుంచి మీకు నచ్చినది ఎంచుకోవచ్చు

మరింత భద్రత

మరింత భద్రత

మొబైల్స్‌ అన్‌లాక్‌ చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫీచర్‌ ఫింగర్‌ ప్రింట్‌. ఫేస్‌ అన్‌లాక్‌ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంది. అయితే ఇది ఎక్కువగా కస్టమ్‌ రామ్‌ ఫోన్లలో ఉంటూ వస్తోంది. గూగుల్‌ 10.0లో ఈ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా తీసుకురానుంది. ఇది మీ ముఖాన్ని 360 డిగ్రీల్లో రీడ్‌ చేస్తుంది.ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో కొత్తగా 'ప్రైవసీ' ఆప్షన్స్ కనిపించనున్నాయి. దీని ద్వారా లొకేషన్ డేటా, పర్మిషన్స్‌పై యూజర్లకు మరింత కంట్రోల్ వస్తుంది.ఆండ్రాయిడ్ క్యూ ఫోల్డబుల్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది.

డిజిటల్ వెల్‌బీయింగ్

డిజిటల్ వెల్‌బీయింగ్

గతేడాది రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్ ఫీచర్ ఉంది. స్క్రీన్ టైమ్‌ని తగ్గించడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఇందులో మరిన్ని ఫీచర్లను యాడ్ చేసింది గూగుల్. యూజర్లు కొన్ని యాప్స్‌ని తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

5జీ కనెక్టివిటీ

5జీ కనెక్టివిటీ

గూగూల్ ‘క్యూ'ను 5జీ అనుకూల వెర్షన్‌గా తీర్చిదిద్దారు. దీని ద్వారా మెరుగైన 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని గూగూల్‌ భావిస్తోంది.కాగా 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే కావడం విశేషం. 5జీ సపోర్ట్ చేసే యాప్స్ తయారు చేసేందుకు కావాల్సిన టూల్స్‌ని డెవలపర్లకు గూగుల్ అందించనుంది.

కొత్తగా గూగుల్ మ్యాప్స్

కొత్తగా గూగుల్ మ్యాప్స్

గూగుల్‌ మ్యాప్స్‌లో నావిగేషన్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. మ్యాప్‌లో ఐకాన్‌ కదలకపోవడం, ఒక చోట ఉంటే ఇంకో చోట చూపించడం లాంటివి జరుగుతున్నాయి. దీనికి చెక్‌ పెడుతూ గూగుల్‌ ‘క్యూ'లో నాణ్యమైన నావిగేషన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

స్క్రీన్ రికార్డర్

స్క్రీన్ రికార్డర్

గూగూల్‌ ‘క్యూ'లో ఇన్‌బిల్ట్‌గా స్క్రీన్‌ రికార్డర్‌ యాప్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.. ఫుల్‌ స్క్రీన్‌.. మంచి నాణ్యతతో ఈ రికార్డర్ ఉంటుందట. కాగా ఈ ఫీచర్ చైనా కంపెనీ ఫోన్లలో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Android Q release date, new features and everything you need to know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X