ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక
మొబైల్ మెసేజింగ్ యాప్ అంటే మనలో చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చేది వాట్సాప్. 2009లో విడులైన వాట్సాప్ మొబైల్ మెసేజింగ్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా ఆవిర్భవించింది. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. స్మార్ట్‌ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్ అకౌంట్ ఉండాల్సిదే.
ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి ఉన్న ఈ ఉచిత చాటింగ్ మైబైల్ యాప్ ద్వారా నిత్యం కోట్లాది మంది చాట్ చేస్తుంటారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఇంకా చదవండి: రూ.10,000 ధరల్లో... బెస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల మేరకు ఫేస్‌బుక్, వాట్సాప్ డీల్ కుదరటానికి రెండు సంవత్సరాల పట్టిందట. ఈ డీల్ కు సంబంధించి తొలసారిగా జూన్ 2012లో మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ సీఈఓ జాన్ కౌమ్ కు ఫోన్ చేసారట.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
చివరాకరకు వీరిద్దరి మధ్య డీల్ ప్రేమికుల రోజున ఒకే అయ్యిందట.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
వాట్సాప్ ఓ రిమైండర్ లాంటిదని అందులో యాడ్స్, గేమ్స్, గిమ్మిక్స్ లాంటివి ఉండకూడదన్నది జాన్ కౌమ్ సిద్ధాంతం.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
జాన్ కౌమ్ తన కుటుంబంతో సహా కమ్యూనిస్ట్ ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
కొద్ది సంవత్సరాల పాటు శాన్‌జోన్ స్టేట్ యూనివర్శిటీలో తరగతులకు హాజరైన జాన్ ఆ తరువాత యాహూలో ఉద్యోగం సంపాదించారు.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
కొద్ది సంవత్సరాల పాటు శాన్ జోన్ స్టేట్ యూనివర్శిటీలో తరగతులకు హాజరైన జాన్ ఆ తరువాత యాహూలో ఉద్యోగం సంపాదించారు. యాహూలో పనిచేస్తున్న సమయంలోనే జాన్ కౌమ్ ఆక్టన్ ను కలిసారు. 2009లో యాహూ నుంచి బయటకొచ్చిన వీరిద్దరు వాట్సాప్ ను ప్రారంభించారు.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
యాహూ సహ వ్యవస్థాపకులు డేవిడ్ ఫైలో జాన్ కౌమ్‌ను ఇంటర్వ్యూ చేసి తమ కంపెనీలో చేరాలని కోరారు. ఈ క్రమంలో జాన్ శాన్ జోన్ స్టేట్ యూనివర్శిటీలో తన విద్యను జాన్ కౌమ్ అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
వాట్సాప్ మార్కెటింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదట.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులనే కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

ఫేస్‌బుక్..వాట్సాప్ ఒప్పందానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
జాన్ కౌమ్ (37), బ్రెయిర్ ఆక్టమ్(44)లకు 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత జాన్ కౌమ్ తో కలిసి ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరించింది.

Click it and Unblock the Notifications